భారతదేశంలో బీర్ బ్రాండ్స్ అన్నింటిలోనూ ఈ బీర్ ను నెంబర్ వన్‌గా పిలుస్తారు. దీని ధర రూ. 200 లోపు ఉంటుంది. దీని వల్ల భారతదేశ బీర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. ఇటీవల సంవత్సరాలలో నగరాల్లో ఎక్కువగా ఈ బీర్ ను తాగుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ బీర్ తాగేందుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పబ్ ల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బ్రాండ్ కూడా ఇదే కావడం విశేషం. అంతే కాకుండా ఈ బీర్ బ్రాండ్ వేరు వేరు రుచుల్లో కూడా లభిస్తుంది. అందుకే అంత ఫేమస్ అయ్యింది.
అది మరేదో కాదు.. కింగ్‌ఫిషర్ ప్రీమియం. ఇది భారతదేశంలో నెంబర్ వన్ బీర్‌గా విస్తృతంగా అమ్ముడవుతోంది. ఇక దీని చరిత్ర విషయానికొస్తే 1978లో ఈ బీర్ మార్కెట్ లోకి వచ్చింది. మైల్డ్ బీర్ విభాగంలో ఈ ప్రీమియం లాగర్ కింగ్‌ఫిషర్ నంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. విద్యార్థులు ఎక్కువగా ఈ బీర్ ను ఇష్టపడుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే దీని ధర కూడా తక్కువ బడ్జెట్ లో ఉంటుంది. అంతేకాకుండా శారీరంగా కష్టపడి పనిచేసే వారు కూడా చల్లని ఈ బీరు తాగి హాయిగా నిద్రపోతారట. అందుకే కింగ్‌ఫిషర్ ప్రీమియం దేశ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతూ నంబర్ స్థానంలో కొనసాగుతోంది.
కింగ్‌ఫిషర్ ప్రీమియం బీర్ ను అధిక నాణ్యత కలిగిన మాల్ట్ బార్లీ, సాజ్ హాప్స్‌తో తయారు చేస్తారు. ఇది తక్కువ ఎసిడిటీ, మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ బీర్ తయారీలో 200 విభిన్న చెకింగ్ టెస్ట్ లు చేస్తారు.
కింగ్‌ఫిషర్ ప్రీమియంలో 4.8 శాతం ఆల్కహాల్ కంటెంట్ (ABV) ఉంటుంది. చాలా ప్రీమియం బీర్‌లకు ఇదే ప్రమాణం. భారతదేశంలోని నెంబర్ వన్ బీర్ గా నిలిచిన కింగ్‌ఫిషర్ ప్రీమియం ధర రూ.130 (330 మి.లీ). అదే 500 మి.లీ అయితే రూ.145 అమ్ముతున్నారు. 650 మి.లీ. అయితే రూ.200 విక్రయిస్తున్నారు. వేరు వేరు ధరల్లో లభిస్తోంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైన బీర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కింగ్‌ఫిషర్ ప్రీమియం బ్రాండ్ అత్యంత ప్రజాదరణ పొందిన బీర్ ఎంపికగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే తరహాలో కింగ్‌ఫిషర్ చెందిన అల్ట్రా (రూ. 175), కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ (రూ. 145) కింగ్‌ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ (రూ. 145) కూడా మందుబాబుల అభిమానాన్ని సంపాదించాయి.
కింగ్‌ఫిషర్ ప్రీమియం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీర్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ బీర్ ఏంటో తెలుసా? దాని పేరు కరోనా. 2024 గణాంక నివేదిక ప్రకారం ఇది 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బీర్ బ్రాండ్‌గా నిలిచింది. దీని అమ్మకాల విలువ $19 బిలియన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,60,372 కోట్లు అన్న మాట.