రైలు 1 కిమీ పరిగెత్తాలంటే ఎంత డీజీల్ కావాలో తెలుసా?

First Published | Oct 28, 2024, 1:38 PM IST

  రైళ్ల డీజిల్ ఇంజిన్లను వాటి పనితీరు ఆధారంగా వర్గీకరిస్తారు. డీజిల్ ట్యాంకులు 500, 5,500, 6000 లీటర్ల సమార్థ్యం కలిగి  ఉంటాయి. రైలుు మైలేజ్, కోచ్ ల సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైళ్ల విద్యుదీకరణ పూర్తయ్యింది. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో రైళ్లు  డీజిల్ తో నడుస్తాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డీజిల్ ఇంజిన్స్ వాడుకలోనే ఉన్నాయి. ఈ డీజిల్ ఇంజిన్ల గురించి తెలుసుకుందాం...

రైళ్ల డీజిల్ ఇంజిన్ల ట్యాంకులు చాలా పెద్దవి. డీజిల్ ఇంజిన్లను వాటి పనితీరు ఆధారంగా మూడు రకాలుగా విభజించారు. డీజిల్ ట్యాంకులు 5000, 5,500, 6,000 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. సుదూర ప్రయాణాలకు ట్యాంకు సామర్థ్యం ఎక్కువ.


రైలు డీజిల్ ఇంజిన్ మైలేజ్ దాని బరువు, కోచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. 12 కోచ్‌ల ప్యాసింజర్ రైలు 6 లీటర్ల డీజిల్‌తో 1 కి.మీ. ప్రయాణిస్తుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల మైలేజ్ కూడా పెద్దగా తేడా ఉండదు.

12 కోచ్‌ల ప్యాసింజర్ రైలు 1 కి.మీ. ప్రయాణించడానికి 6 లీటర్ల డీజిల్ అవసరం. అంటే 100 కి.మీ. ప్రయాణానికి 600 లీటర్ల ఇంధనం అవసరం. రోజూ ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది.

24 కోచ్‌ల ఎక్స్‌ప్రెస్ రైలు 6 లీటర్ల డీజిల్‌తో 1 కి.మీ. ప్రయాణిస్తుంది. 12 కోచ్‌లుంటే కి.మీ.కి 4.5 లీటర్లు వినియోగం అవుతుంది. రైలు బరువు తగ్గేకొద్దీ మైలేజ్ పెరుగుతుంది. కోచ్‌ల సంఖ్యపై రైళ్ల మైలేజ్ ఆధారపడి ఉంటుంది.

Latest Videos

click me!