UPI: డెబిట్‌ కార్డు లేకుండా యూపీఐ పిన్‌ ఎలా సెట్‌ చేసుకోవాలి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌

Published : Mar 19, 2025, 09:54 AM IST

ప్రస్తుతం దేశంలో యూపీఐ సేవలు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారు. క్షణాల్లో డబ్బులను పంపించుకునే అవకాశం రావడంతో చాలా మంది యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్నారు..   

PREV
14
UPI: డెబిట్‌ కార్డు లేకుండా యూపీఐ పిన్‌ ఎలా సెట్‌ చేసుకోవాలి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌

ఒకప్పుడు ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాలోకి డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి, డిపాజిట్‌ ఫామ్‌ నింపడం ఇలా పెద్ద తతంగం ఉండేది. కానీ ఎప్పుడైతే యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాయో నగదు లావాదేవీలు సులభమయ్యాయి. ఒక క్లిక్‌తో ఒకరి ఖాతాలో నుంచి మరో ఖాతాలోకి డబ్బులు పంపించుకునే రోజులు వచ్చేశాయ్‌. అయితే యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించుకోవాలంటే డెబిట్‌ కార్డు తప్పనిసరి అనే విషయం తెలిసిందే. 
 

24

కొత్తగా యూపీఐ సెట్‌ చేసుకోవాలన్నా, పాత పిన్‌ను మార్చుకోవాలన్నా కచ్చితంగా డెబిట్‌ కార్డు ఉండాల్సిందే. అయితే కొందరు డెబిట్‌ కార్డు లేని వాళ్లు కూడా ఉంటారు. ముఖ్యంగా సంతకం చేయలేని వారికి డెబిట్‌ కార్డులు రావు. మరి అలాంటి వారు యూపీఐ పేమెంట్స్‌ చేయలేరా.? అంటే దీనికి కూడా ఒక అవకాశం ఉందని తెలుసా.? ఇంతకీ డెబిట్‌ కార్డు లేకుండా యూపీఐ పిన్‌ను ఎలా మార్చుకోవాలి.? ఇందుకోసం ఎలాంటి ప్రాసెస్‌ ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 
 

34

కచ్చితంగా ఆధార్‌ కార్డు ఉండాలి: 

అయితే డెబిట్‌ కార్డు లేకుండా యూపీఐ పిన్‌ మార్చుకోవాలనుకుంటే కచ్చితంగా ఆధార్‌ కార్డు ఉండాల్సి ఉంటుంది. అందులోనూ మీరు యూపీఐ పిన్‌ సెట్‌ చేసుకోవాలనుకుంటున్న బ్యాంకుకు మీ ఆధార్‌ కార్డ్‌తో లింక్‌ అవ్వాలి. అలాగే మీ ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌తో కూడా లింక్‌ అయ్యి ఉండాలి. అలా అయితేనే ఆధార్‌తో యూపీఐ పిన్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. 
 

44

డెబిట్‌ కార్డు లేకుండా యూపీఐ పిన్‌ మార్చడ ఎలా.? 

* ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 

* తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. 

* తర్వాత మీరు యూపీఐ పిన్ మార్చాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* యూపీఐ పిన్‌ సెట్‌ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

* ఇందులో డెబిట్ కార్డ్, ఆధార్ OTP అనే రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 

* రెండో ఆప్షన్‌ ఆధార్‌ ఓటీపీని సెలక్ట్‌ చేసుకోవాలి. 

* వెంటనే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయడం ద్వారా యూపీఐ పిన్‌ మార్చుకోవచ్చు. 

click me!

Recommended Stories