వ్యక్తిగత ఆరోగ్య సేవల ఇండెక్స్ లో భారత్ కు 10వ స్థానం..: సర్వే రిపోర్ట్

First Published Jan 29, 2021, 11:41 AM IST

 ఆసియా పసిఫిక్ దేశాలలో వ్యక్తిగత ఆరోగ్య సౌకర్యాలపై నిర్వహించిన ఒక సర్వేలో పదకొండు దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉందని తేలింది.
 

ది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈ‌ఐ‌యూ) ఆసియా పసిఫిక్ పర్సనాలైజేడ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం, పసిఫిక్‌లోని ఆస్ట్రేలియా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్ ఇంకా న్యూజిలాండ్ వంటి దేశాలు సరైన వ్యక్తికి, సరైన సమయానికి చికిత్సను అందిస్తాయి అని తెలిపింది.
undefined
27 వేర్వేరు పాయింట్ల ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. ఆరోగ్య సమాచార సూచికలో భారత్ 41 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది.
undefined
ఆరోగ్య సంరక్షణలో 24 పాయింట్లతో భారత్ పదకొండవ స్థానంలో ఉండగా, వ్యక్తిగత స్థాయిలో ఆరోగ్య సంరక్షణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో భారత్ 30 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఆరోగ్య విధానంపై, భారతదేశం 48 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది, ఇది వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగంలో మెరుగైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.
undefined
సింగపూర్‌లోని హెల్త్‌కేర్ ఫైనెస్ట్రిపోర్ట్ ప్రకారం , ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని పదకొండు దేశాలు ఉత్తమ స్థితిలో ఉన్నాయి. రెండో స్థానంలో తైవాన్, మూడవ స్థానంలో జపాన్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలు, సేవలు, సాంకేతిక రంగాలలో ఇండోనేషియా అత్యంత వెనుకబడినది, ఈ జాబితాలో ఇండోనేషియా పదకొండవ స్థానంలో ఉంది.
undefined
click me!