ఒకే నెలలో రూ. 60 లక్షలు సంపాదించిన యూట్యూబర్ అన్వేష్ గురించి ఎవరికి తెలియని రహస్యాలు ఇవే..

First Published | Aug 14, 2023, 3:02 PM IST

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో డబ్బులు సంపాదించడం అంత సులువైన విషయమైతే కాదు.  ఎంత ప్రయత్నించినా మహా అయితే వంద డాలర్లు లేదా రెండు వందల డాలర్లకు మించి సంపాదించలేమని చాలామంది యూట్యూబ్లో వాపోతూ ఉంటారు.  అంతేకాదు కంటెంట్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన వేళల్లోనే ఆదాయం ఉంటుందని చాలామంది నిరాశ కూడా చెందుతూ ఉంటారు.  ఎంతోమంది లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వీడియోలు తీసి ఆదాయం లేక చేతులెత్తేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 

anvesh

మరి అలాంటి యూట్యూబ్ నుంచి ఒక తెలుగువాడు ఒకే నెలలో 60 లక్షల రూపాయలు సంపాదించాడు.  అతను మరెవరో కాదు నా అన్వేషణ పేరుతో  ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తున్న అన్వేష్, ఈ ఫీట్ సాధించాడు.  యూట్యూబ్ లో  ఛానల్ పెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తోంది ఈ నాలుగేళ్లలో అన్వేష్ దాదాపు 85 దేశాలు తిరగడం విశేషం.  అయితే తొలి రెండు సంవత్సరాలు మాత్రం అన్వేష్ యూట్యూబ్ ఆదాయం చాలా తక్కువగా ఉంది. 
 

(Image : YoutubeNaa Anveshana)

కానీ కాలం గడిచే కొద్దీ అతని సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది ప్రస్తుతం 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు అతని ఛానల్ ను  సబ్స్క్రైబ్ చేసుకున్నారు.  అంతే కాదు దాదాపు 1000 వీడియోలు అన్వేష్ షూట్ చేయడం విశేషం.  వైజాగ్ కు చెందినటువంటి అన్వేష్ ట్రావెలింగ్ అండ్ టూరిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.  ట్రావెలింగ్ మీద ఇష్టంతో అతను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను తిరగాలని  సంకల్పించుకున్నాడు.  అందులో భాగంగానే ఇప్పటికే 85 దేశాలు పూర్తి చేయడం విశేషం. 


(Image : YoutubeNaa Anveshana)

అయితే గడచిన రెండు నెలలుగా అతని ఆదాయం భారీగా పెరిగింది.  గత నెలలో చైనాలో చేసినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి దీంతో అన్వేష్ కు  ఆనెల ఏకంగా 30 లక్షల రూపాయలు వచ్చాయి.  ఆ తర్వాత మరో నెల వచ్చేటప్పటికి అన్వేష్ ఆదాయం ఏకంగా రెండింతలు అయింది గత నెల ఏకంగా 60 లక్షల రూపాయలు అన్వేష్ సంపాదించడం విశేషం. 

దీనికి సంబంధించిన వీడియోను సైతం అన్వేష్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు తన ఆదాయం రెండింతలు అవడానికి ప్రధాన కారణం గతంలో తాను చేసినటువంటి పాత వీడియోలు అన్నిటిని ప్రేక్షకులు చూడటం వల్లనే తన ఆదాయం రెండింతలు అయిందని పేర్కొన్నాడు. 

ప్రేక్షకుల మద్దతు వల్లనే తాను  ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం పొందినట్లు అన్వేష్ పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే అన్వేష్ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నాడు. తాను అతి త్వరలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టి  ప్రపంచ రికార్డు సృష్టిస్తానని అన్వేష్ చెబుతున్నాడు.  అయితే  ప్రస్తుతం తనకు వచ్చిన డబ్బుల్లో ప్రస్తుతం టాక్స్ చెల్లిస్తున్నానని  అన్వేష్ చెబుతున్నారు.  ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా మంచిదని అన్వేష్ తెలపడం విశేషం. 

అన్వేష్ కు పోటీగా గతంలో చాలామంది యూట్యూబర్లు ప్రపంచ పర్యటన ప్రారంభించినప్పటికీ,  ఈ స్థాయిలో గుర్తింపు అదే విధంగా ఆదాయం రాకపోవటం విశేషం.  అయితే ప్రస్తుతం అన్వేష్ కెనడా నుంచి పర్యటన ముగించి త్వరలోనే ఆఫ్రికా వెళ్తానని చెప్పడం విశేషం.

Latest Videos

click me!