Gold Rate: బంగారం ఏకంగా 11,000 రూపాయలు తగ్గింది..శ్రావణ మాసంలో ఎంత తగ్గబోతుందో తెలిస్తే పండగే..

First Published | Aug 14, 2023, 2:28 PM IST

మరో మూడు రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది ఈ నేపథ్యంలో పసిడి ధరలు తగ్గి రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే వరం అనే చెప్పాలి. మొన్నటి వరకు 60 వేల రూపాయలు దాటినటువంటి బంగారం ధర ప్రస్తుతం 60 వేల దిగువకు దిగి వచ్చింది. భవిష్యత్తులో బంగారం ధర ఎంత తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆగస్టు 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది శ్రావణమాసం వచ్చిందంటే పెళ్ళిలో సీజన్ వచ్చినట్లే ఈ పెళ్లిలో సీజన్లో మీకు ఒక శుభవార్త బంగారం ధర భారీగా తగ్గుతోంది.  పసిడి ధరలు గమనించినట్లయితే గడచిన 15 రోజుల్లో భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 59,620  రూపాయల వద్ద ట్రేడవుతోంది.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,650  రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.  ట్రెండు ఇలాగే కొనసాగితే 24 క్యారెట్ల బంగారం ధర అతి త్వరలోనే 55000 రూపాయలకు దిగి వచ్చే అవకాశం ఉందని  పసిడి వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే బంగారం ధర అంతర్జాతీయంగా భారీగా దిగి వస్తోంది ముఖ్యంగా మే నెలలో బంగారం ధర అమెరికా మార్కెట్లో ఒక ఔన్సు 2050 డాలర్లు ఉంటే ప్రస్తుతం అది 1915  డాలర్లకు  దిగి వచ్చింది.  అంటే దాదాపు 130 డాలర్లు తగ్గింది.  దాదాపు 11 వేల రూపాయలు దిగివచ్చినట్లు మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో  మనదేశంలో పసిడి మార్కెట్లో కూడా  బంగారం ధరలు నెమ్మదిగా తగ్గి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ట్రెండు కొనసాగినట్లయితే బంగారం ధర మరో రెండు నెలల్లో 55,000 దిగువకు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 


పసిడి ధరలు తగ్గే కొద్దీ మన దేశంలో బంగారు ఆభరణాలు కొనే వారి సంఖ్య పెరుగుతుందని నగల షాపుల వారు అంచనా వేస్తున్నారు.  ఇదిలా ఉంటే శ్రావణమాసంలో ప్రతి భారతీయ  కుటుంబం బంగారం కొనుగోలు చేయాలని పరితపిస్తుంది.  కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు తద్వారా లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువవుతుందని ఆశిస్తారు. 
 

ఇదిలా ఉంటే బంగారం ధరలు ప్రస్తుతం తగుముఖం పడుతున్న నేపథ్యంలో ఆభరణాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోతాయని ఆభరణాల దుకాణాల వారు ఆశిస్తున్నారు.  అయితే బంగారం కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.  దీనికి కారణం లేకపోలేదు ఒక గ్రాము బంగారం తేడా వచ్చిన మీరు వేలల్లో నష్టపోయే అవకాశం ఉంది. 

నగల దుకాణంలో మీరు  హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారమే కొనుగోలు చేయాలి.  హాల్ మార్క్ లేని బంగారం విక్రయించడం కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.  అయితే ఒక్కోసారి షాపుల్లో 18 క్యారెట్ల బంగారం ని 22 క్యారెట్ల బంగారం అని చెప్పి విక్రయిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మీరు పెద్ద ఎత్తున మోసపోయే అవకాశం ఉంది.  మీరు బంగారం కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదును దాచి పెట్టుకుంటే మంచిది. . తద్వారా మీరు భవిష్యత్తులో నగలకు సంబంధించిన ఎలాంటి కంప్లైంట్ ఉన్నప్పటికీ మీకు ప్రూఫ్ గా రసీదు పనికి వస్తుంది. 

Latest Videos

click me!