ఐటిఆర్ దాఖలు చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే మీకు నష్టం జరుగవచ్చు..

First Published | Jul 26, 2021, 4:28 PM IST

 ఆర్ధిక సంవత్సరం 2020-21 (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) కు ఐటిఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ 31  జూలై 2021 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే  పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గత నెల జూన్ 7న  కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ప్రారంభించింది.  
 

పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి సరైన ఐటిఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం ఇంకా అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వడం అవసరం. మీకు జీతం, హౌస్ ప్రాపర్టీ, వ్యాపారం లేదా వృత్తి లేదా వడ్డీ-డివిడెండ్ వంటి ఇతర వనరుల నుండి ఆదాయం ఉంటే ఐ‌టి రిటర్న్ దాఖలు చేసేటప్పుడు వీటి పూర్తి వివరాలను ఇవ్వండి.
అలాగే మీ బ్యాంకు ఖాతా సమాచారం కూడా నివేదించండి. అంటే ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ పేరు, ఖాతా నంబర్ గురించి సమాచారం. దీని అవసరం ఎందుకంటే రిటర్న్ అప్ డేట్ చేసిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమ అవుతుంది.

విదేశీ ఆస్తులు పెట్టుబడులు, విదేశాలలో ఖాతాలు లేదా విదేశీ వనరుల నుండి వచ్చే ఆదాయాన్ని నివేదించడం కూడా అవసరం. దీని కోసం రిటర్న్ ఫాంలో షెడ్యూల్ ఎఫ్‌ఏ నింపల్సి ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్, బ్యాంకుల నుండి వడ్డీ ఆదాయం, పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఐటిఆర్ లో ముందే నింపబడతాయి. దీని ఒకసారి తనిఖీ చేయండి.
ఐటిఆర్‌లో ఏదైనా సవరణలు ఉంటే 31 జనవరి 2022లోపు మాత్రమే చేయవచ్చు. ఆ తరువాత ఎటువంటి సవరణలు అనుమతించబడవు. ఐటిఆర్ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన 120 రోజుల్లో ఎలక్ట్రానిక్‌గా లేదా మాన్యువల్‌గా వెరిఫి చేయండి.
ఐటిఆర్ దాఖలు చేయడానికి సరైన ఫారమ్ ఎంచుకోవడం ముఖ్యం. ఇందుకు ఐటిఆర్ -1, ఐటిఆర్ -2, ఐటిఆర్ -3, ఐటిఆర్ -4, ఐటిఆర్ -5, ఐటిఆర్ -6, ఐటిఆర్ -7 అనే ఏడు ఫార్మ్లను విడుదల చేసింది. మీరు తప్పగా ఫామ్ నింపినట్లయితే ఐ‌ఆర్‌టిని పరిగణలోకి తీసుకోదు. సరైన ఫారమ్‌ను ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీరు కొత్త సిస్టంను ఎంచుకుంటే ఫారం 10ఐ‌ఈ నింపిన తర్వాత మాత్రమే రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే సెక్షన్ 115 బిఎసి కింద తగ్గిన పన్ను రేటును క్లెయిమ్ చేయడానికి మీకు అర్హత ఉండదు.

Latest Videos

click me!