ఎల్‌పిజి సిలిండర్ ధరలుచమురు కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. అంటే రేపటి నుంచిప్రతి నెల మొదటిరోజున దేశంలో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు మరవచ్చు. ప్రతి రాష్ట్రంలో పన్ను భిన్నంగా ఉంటుంది కాబట్టి దీని ప్రకారం ఎల్‌పిజి ధర మారుతూ ఉంటుంది. ప్రస్తుతం, ప్రతి సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లకు ప్రభుత్వం సంవత్సరానికి సబ్సిడీ ఇస్తుంది. వినియోగదారులు దీని కంటే ఎక్కువ సిలిండర్లు తీసుకోవాలనుకుంటే, వారు వాటిని మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేయవలసి ఉంటుంది. వీటి ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లు అలాగే విదేశీ మారక రేట్ల మార్పు వంటి అంశాలు నిర్ణయిస్తాయి.
ఎటిఎంల నుండి డబ్బు విత్ డ్రాపంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కస్టమర్లకు చాలా ముఖ్యమైన వార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేపు నుండి ఏటీఎంల నుండి నగదు ఉపసంహరించుకునే పద్ధతులను మార్చబోతోంది. పెరుగుతున్న మోసాల కేసుల దృష్ట్యా, కస్టమర్లు ఎటిఎంల నుండి డబ్బును ఉపసంహరించుకోవడాన్ని మరింత సురక్షితంగా చేయడానికి పిఎన్‌బి వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి) వ్యవస్థను అమలు చేయబోతోంది.దీని వల్ల ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవాలంటే, మీరు బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన రూ.10 వేలకు పైగా చేసే నగదు లావాదేవీలకు వర్తిస్తుంది.పిఎన్‌బి ట్వీట్ ప్రకారం డిసెంబర్ 8 నుండి ఉదయం 8 గంటల తరువాత పిఎన్‌బి ఎటిఎం నుండి ఒకేసారి రూ .10వేల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ ఇప్పుడు ఓటిపి వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కస్టమర్లు తమ మొబైల్‌ను తమతో తీసుకెళ్లడం మర్చిపోకూడదు. ఇతర బ్యాంక్ ఎటిఎంలకు డబ్బును ఉపసంహరించుకోవడానికి ఒటిపి ఆధారిత నగదు ఉపసంహరణ సౌకర్యం వర్తించదు.
రియల్ టైమ్ గ్రాస్ సొల్యూషన్(ఆర్‌టిజిఎస్) వ్యవస్థ డిసెంబర్ 2020 నుండి రోజుకు 24 గంటలు పనిచేస్తుందని అక్టోబర్‌లో ఆర్‌బిఐ ప్రకటించింది. అంటే, డిసెంబర్ నుండి పెద్ద మొత్తాన్ని బదిలీ చేయడానికి మీరు బ్యాంక్ వర్కింగ్ అవర్స్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.వినియోగదారుల కోసం ఆర్‌టిజిఎస్ సిస్టమ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ సెలవు ఉన్నప్పుడు లేదా రెండవ, నాల్గవ శనివారాలలో ఈ సౌకర్యం మూసివేయబడుతుంది.అలాగే ఈ సేవ ఆదివారం కూడా ఉండదు.కనీస పరిమితి రెండు లక్షల రూపాయలు,అయితే దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ ఈ చర్య తీసుకుంది. కరోనా యుగంలో డిజిటల్ బ్యాంకింగ్ వాడకం పెరిగింది.ఆర్‌టిజిఎస్ అంటే ఏమిటి?ఆర్‌టిజిఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సొల్యూషన్ వ్యవస్థ. 'రియల్ టైమ్' అంటే తక్షణం. మీరు డబ్బు బదిలీ చేసిన వెంటనే అని అర్థం, అది ఏ సమయంలోనైనా ఇతరుల ఖాతాకు చేరుకుంటుంది. మీరు ఆర్‌టిజిఎస్ ద్వారా లావాదేవీ చేసినప్పుడు, డబ్బు వెంటనే మరొక ఖాతాకు నగదు బదిలీ చేయబడుతుంది.
కొత్త రైళ్లు ప్రయోగించేందుకుభారతీయ రైల్వే కరోనా సంక్షోభం సమయంలో ప్రత్యేక రైళ్ళను నడిపింది. ఇప్పుడు ఇందులో భాగంగానే 1 డిసెంబర్ 2020 నుండి రైల్వే కొత్త రైళ్లను నడపనుంది.