తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనాలనుకుంటే ఇక్కడ మేము కేవలం అయదు లక్షల రూపాయల్లో వచ్చే కార్ల వివరాలు ఇచ్చాము. రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో వంటివి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి.
మారుతి సుజుకి సెలెరియో
ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి మారుతి సుజుకి సెలెరియో మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు. పెట్రోల్ వేరియంట్ 24.97 నుంచి 26.68 కిలోమీటర్ల వరకు, సీఎన్‌జీ వేరియంట్ 34.43 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో రోజూ ప్రయాణించేందుకు ఈ కారు చాలా ఉత్తమ ఎంపిక.