కోళ్లు, మేకలు కాదు పాములు పెంచితే చాలు నెలకు కోట్లలో ఆదాయం..ఎక్కడో తెలిస్తే షాక్ తినడం ఖాయం...

First Published | Aug 14, 2023, 4:33 PM IST

 డబ్బు సంపాదించాలంటే సవాలక్ష మార్గాలు ఉన్నాయి.  కొంతమంది కోళ్ల ఫారంలో కోళ్లు పెంచుతుంటే మరికొందరు మేకలు గొర్రెలు పెంచి డబ్బులు సంపాదిస్తారు అలాగే ఆవులు గేదలు పెంచి పాలు అమ్మి డబ్బు సంపాదిస్తారు కానీ విచిత్రంగా ఒక వ్యక్తి పాములను పెంచి కోట్లు సంపాదిస్తున్నాడు ఇది ఎక్కడో కాదు మన పొరుగునే ఉన్న చైనాలో కావడం విశేషం. 

చైనా దేశంలో జిసికియావో అనే గ్రామంలో  పాములను పెంచడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.  అక్కడ కొందరు పాములను పెంచి వాటిని విక్రయిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.  అయితే పాములను పెంచడం ద్వారా డబ్బులు ఎలా వస్తాయో అని ఆలోచిస్తున్నారా నిజానికి చైనాలో పాము మాంసం తింటారు.  అక్కడ పాము  మాంసానికి చాలా గిరాకీ ఉంటుంది.  దీని దృష్టిలో పెట్టుకొని  అక్కడ కొందరు యువకులు  స్నేక్ ఫాంలలో  పాములను పెంచి డబ్బు సంపాదిస్తున్నారు. 

 ఒక్కో ఫామ్ లో దాదాపు 30 వేల కంటే ఎక్కువ పాములు పెంచుతారని స్థానికులు చెబుతున్నారు.  నిజానికి పాము మాంసంతో పాటు దాని శరీరంలోని ఇతర భాగాలకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది.  నిజానికి ఒక లీటరు పాము విషం దాదాపు మూడు కోట్ల పైనే ఉంటుంది.  ఖరీదైన బెల్టులు,  ఇతర వస్తువులను కూడా తయారు చేస్తారు.  దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాములను పెంచుతున్నారు. 


 పాములను పెంచేందుకు వీరు ప్రత్యేకంగా కోళ్ల ఫారం లాంటి నిర్మాణాలను చేపట్టారు.  వీటిలో దాదాపు 30 వేల వరకు పాములను పెంచుతారు ఈ పాముల్లో విషపూరితమైన పాముల నుంచి కొండచిలువల వరకు ఉన్నాయి ఒక్కో పాముకు ఒక్కో ధర ఉంటుంది.  అయితే జంతు ప్రేమికుడు మాత్రం ఈ విధంగా పాములను పెంచడం ప్రకృతి ధర్మానికి విరుద్ధమని,  వాటిని చెబుతున్నారు.  అయినప్పటికీ చైనా చట్టాలకు అనుగుణంగా పాములను చంపడం నేరం కాదు. 
 

 దీంతో అక్కడ వ్యవసాయంతో పాటు పాములను పెంచడం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు.  ఈ పాములను చెక్క పెట్టలు గాజు సీసాలో భద్రపరిచి విక్రయిస్తూ ఉంటారు బహిరంగ మార్కెట్లో వీటి ధర లక్షల్లో ఉంటుంది అయితే ఈ పాము మాంసానికి చైనా తోపాటు తైవాన్, వియత్నాం,  వాటి ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది.  దీని దృష్టిలో ఉంచుకొని అడవుల్లో పాములను పట్టడం కన్నా కూడా ఈ విధంగా పెంచడం ఉత్తమం అని చైనా రైతులు భావిస్తున్నారు. 
 

 అయితే మనదేశంలో మాత్రం వన్య ప్రాణి చట్టాలు,  చాలా కఠినంగా ఉన్నాయి అందుకే మన దేశంలో పాములను చంపడం వేటాడటం నిషేధం. 
 

Latest Videos

click me!