ఒక ఎకరం భూమి ఉన్నా చాలు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 95 శాతం సబ్సిడీతో ఈ వ్యవసాయం చేస్తే, నెలకు లక్షల్లో ఆదాయం..

Published : Nov 17, 2022, 01:37 PM ISTUpdated : Nov 17, 2022, 01:49 PM IST

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే వాణిజ్య వ్యవసాయం ద్వారా కూడా  చక్కటి ఆదాయం సంపాదించవచ్చు.  మీ వద్ద తక్కువ భూమి ఉన్నప్పటికీ,  వ్యవసాయం చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

PREV
17
ఒక ఎకరం భూమి ఉన్నా చాలు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 95 శాతం సబ్సిడీతో ఈ వ్యవసాయం చేస్తే, నెలకు లక్షల్లో ఆదాయం..

పాలీహౌస్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి విదేశీ జాతుల పుష్పాలను సాగు చేసి, చాలా మంది యువ రైతులు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. పాలీ హౌస్ పద్దతి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు అన్నింట్లో అందుబాటులోకి వచ్చింది.  అంతేకాదు పాలీహౌస్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం సబ్సిడీని అందిస్తోంది 

27

పాలీహౌస్‌ల ఏర్పాటుకు తెలంగాణలో 2014-15లో 75% సబ్సిడీ అందిస్తున్నారు. విదేశీ పూల సాగును ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 2016-17లో ఎస్సీ/ఎస్టీ రైతులకు సబ్సిడీని 95 శాతానికి పెంచారు. 
 

37
dhyaneshwar

మీరు కూడా పాలీహౌస్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అనుకుంటే సమీపంలోని తెలంగాణ ప్రభుత్వ  హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చు. 2014-15లో తెలంగాణ ప్రభుత్వం ఈ పాలీ హౌస్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1150 ఎకరాల విస్తీర్ణంలో 917 మంది రైతులు పాలీహౌస్ వ్యవసాయం చేస్తున్నారు. 

47

 hydroponic

ఈ పాలీహౌస్ పద్ధతి కింద ఎక్కువగా విదేశాల్లో లభించే  పువ్వులను ఇక్కడే సాగు చేయవచ్చు. ముఖ్యంగా గులాబీ, జర్బెరా, గ్లాడియులస్, ఆర్కిడ్ పువ్వులను సాగు చేస్తారు. ఈ పువ్వులను ఎక్కువగా డెకరేషన్ కోసం వాడుతుంటారు. తద్వారా ఎక్కువగా లాభం పొందే వీలుంది.  ఈ విదేశీ పుష్పాలకు పెళ్లిళ్లు ఫంక్షన్ల డెకరేషన్ లలో ఎక్కువగా వాడుతుంటారు. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. 
 

57

పాలీహౌస్ రైతులను ఒక ఎకరం విస్తీర్ణంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.  ఇందు కోసం పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి అవసరం లేదు.  మార్కెట్లో ఈ విదేశీ జాతుల పూలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక ఈ పూల సాగు కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.  వీటికి వాడే మందులు,  కటింగ్,  ప్యాకింగ్ కోసం ముందుగానే శిక్షణ తీసుకోవాలి.  లేకపోతే నష్టపోయే ప్రమాదం ఎక్కువ. 

67

అలాగే ఆర్డర్లను  రెగ్యులర్ గా పొందేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలి.  అప్పుడు మీకు బిజినెస్ చక్కగా రన్  అవుతుంది.  ఈ పాలీ హౌస్ పద్ధతిలో కేవలం పువ్వులు మాత్రమే కాదు.  అరుదైన ఖరీదైన కూరగాయలు పండ్లను కూడా సాగు చేయవచ్చు.  స్ట్రాబెరీ, బ్లూ బెర్రీ,  విదేశీ రకం ద్రాక్షలను పండించవచ్చు. 

77

పాలీహౌస్ వ్యవసాయం ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నీకు ప్రతి సంవత్సరం దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.  మీ వద్ద పనిచేసే కూలీలకు కూడా ముందుగానే శిక్షణ ఇప్పించాలి ఉంటుంది.  లేకపోతే నష్టం వచ్చే ప్రమాదం ఉంది.  పాలీహౌస్ లో కరెంటు  సౌకర్యం కూడా కల్పించుకోవాలి.  కొన్ని రకాల పుష్పాలకు  ఎప్పుడూ చల్లదనం కావాలి.  అందుకని స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవాలి. తేమ వాతావరణం కోసం మిస్ట్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి. 

click me!

Recommended Stories