50 ఓవర్ల ప్రపంచ కప్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఎవరు కిరీటాన్ని కైవసం చేసుకుంటారో విజేతలుగా ఎవరు నిలుస్తారో ఆదివారం నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం దీనికి వేదిక కానుంది.
ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ముందే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రికెట్ (ICC) మొత్తం USD 10 మిలియన్ ప్రైజ్ వెల్లడించింది. ప్రపంచ కప్ లో పాల్గొనే ప్రతి జట్టు, ఇంకా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా దానితో సంబంధం లేకుండా ఈ ప్రైజ్ మనిలో వాటాను అందుకుంటారు. సెమీస్‌కు అర్హత సాధించలేకపోయిన ఆరు జట్లు -పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్- ఒక్కొక్కటి USD 100,000 (సుమారు రూ. 84 లక్షలు) అందుకుంటారు. అంతేకాకుండా లీగ్ మ్యాచ్‌లో గెలిచినందుకు జట్టుకు USD 40,000 (సుమారు రూ. 33 లక్షలు) ప్రోత్సాహకం లభిస్తుంది.
సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు ఒక్కొక్కరికి USD 800,000 (సుమారు రూ. 6 కోట్లు), ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన వారికి USD 2,000,000 (సుమారు రూ. 16 కోట్లు) అందుతాయి. ICC పురుషుల ప్రపంచ కప్ 2023 విజేతకు ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు భారీ USD 4,000,000 (సుమారు రూ. 33 కోట్లు) లభిస్తుంది.
వేదిక USD రేట్ USD మొత్తం
విజేత 4,000,000 4,000,000
రన్నరప్ 2,000,000 2,000,000
ఓడిపోయిన సెమీ-ఫైనలిస్ట్ 800,000 1,600,000
ఇప్పటివరకు అన్ని జట్లకు అందిన మొత్తం-
నాకౌట్ క్వాలిఫైయర్స్:
భారతదేశం
ఇప్పటివరకు 9 విజయాలు: ప్రైజ్ మనీ: USD 280,000 పైగానే (2.3 కోట్లకు పైమాటే)
దక్షిణ ఆఫ్రికా
ఇప్పటివరకు 7 విజయాలు: ప్రైజ్ మనీ USD 280,000 (2.3 కోట్లకు పైమాటే)
ఆస్ట్రేలియా
ఇప్పటివరకు 7 విజయాలు: ప్రైజ్ మనీ: USD 280,000 (2.3 కోట్లకు పైమాటే)
న్యూజిలాండ్
ఇప్పటివరకు 5 విజయాలు: ప్రైజ్ మనీ: USD 200,000 (1.6 కోట్లకు పైమాటే)
పాకిస్తాన్
విజయాలు: 4
ప్రైజ్ మనీ ఇప్పటివరకు: USD 260,000(2.1 కోట్లకు పైమాటే)
ఆఫ్ఘనిస్తాన్
విజయాలు: 4
ప్రైజ్ మనీ ఇప్పటివరకు: USD 260,000(2.1 కోట్లకు పైమాటే)
ఇంగ్లండ్
విజయాలు: 3
ప్రైజ్ మనీ ఇప్పటివరకు: USD 220,000 (1.8 కోట్లకు పైమాటే)
బంగ్లాదేశ్
విజయాలు: 2
ప్రైజ్ మనీ ఇప్పటివరకు: USD 180,000 (1.4 కోట్లకు పైమాటే)
శ్రీలంక
విజయాలు: 2
ప్రైజ్ మనీ ఇప్పటివరకు: USD 180,000 (1.4 కోట్లకు పైమాటే)
నెదర్లాండ్స్
విజయాలు: 2
ప్రైజ్ మనీ ఇప్పటివరకు: USD 180,000(1.4 కోట్లకు పైమాటే)