హైదరాబాద్ పాన్ షాప్ ఓనర్ల తెలివి, ఫుడ్ డెలివరీ యాప్ లో సిగరెట్ల డెలివరీ

First Published May 24, 2021, 6:04 PM IST

మద్యం అక్రమంగా విక్రయించడం చూసుంటారు.. బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతుంటారు.. ఇదంతా పాత పద్దతి. టెక్నాలజి పెరుగుదలతో పాటు అమ్మకాల పద్దతి కూడా మారిపోయింది. ప్రస్తుతం దేశం మొత్తం ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ అమలులో ఉంది. 

ఉదయం 6 నుండి 10 వరకు మాత్రమే బయటకి వెళ్ళేందుకు అనుమతి ఉంది ఇచ్చారు. హాస్పటళ్ళు, మెడికల్ షాపుల మినహ కిరాణా షాపులు, స్టోర్లు, రెస్టారెంట్లతో పాటు అన్నీ 10 గంటలకు మూసివేస్తున్నారు. అయితే పొగరాయుల్లను దృష్టిలో పెట్టుకుకొని ఇప్పుడు స్మార్ట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఎంటో అనుకుంటున్నారా...
undefined
సాధారణంగా పాన్ షాపుల్లో పాన్, సిగరెట్లు అమ్ముతుంటారు. లాక్ డౌన్ కారణంగా ధూమపానం చేసే వారికి ఇవి అంతా సులభంగా అందుబాటులో లేవు. దీంతో పొగరాయుల్లా కష్టాలను అర్ధం చేసుకొని ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్వీగ్గి లో సిగరెట్లకు పాన్ పేరు జత చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. వినడానికి కొత్తగా ఉన్న ఇది నిజం.. సిగరేట్లను ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా విక్రయించడానికి వీళ్ళేదు.
undefined
అయితే నేరుగా సిగరెట్లను అమ్మకుండా వాటికి పలు రకాల పాన్ పేరు జోడించి అమ్ముతున్నారు. వీటి ధరలు కూడా కాస్త ఎక్కువే. ఉదయం 10 దాటితే సిగరెట్లు తాగేవారికి కొనుగోలు కష్టంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకొని ఇప్పుడు వాటిని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్వీగ్గి ద్వారా ఆర్డర్ చేసిన వారికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్ లోని కొండపూర్, గచ్చిబౌలీలో జరుగుతుంది.
undefined
click me!