UPI సహాయంతో కస్టమర్ ఆథరైజేషన్ చేయబడుతుంది, అయితే నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS) లేదా ATM నెట్‌వర్క్‌ల ద్వారా సెటిల్మెంట్ చేయబడుతుంది అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. "ఇంటర్‌చేంజ్ ఫీజు, కస్టమర్ ఛార్జీలపై సర్క్యులర్ కింద నిర్దేశించినవి కాకుండా ఎలాంటి ఛార్జీలు విధించకుండా ఆన్-అస్ / ఆఫ్-అస్ ICCW లావాదేవీలు ప్రాసెస్ చేయబడతాయి" అని సర్క్యులర్లో పేర్కొంది.
విత్ డ్రా పరిమితులు సాధారణ ఆన్-అస్ అండ్ ఆఫ్-అస్ ATM విత్ డ్రా పరిమితులకు అనుగుణంగా ఉంటాయి అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. "టర్న్ ఎరౌండ్ టైమ్ (TAT) హార్మోనైజేషన్, ఫెయిల్ లావాదేవీలకు కస్టమర్ నష్టపరిహారానికి సంబంధించిన అన్ని ఇతర సూచనలు వర్తిస్తాయి" అని సర్క్యులర్ పేర్కొంది.