Business Ideas: ఊరు కదలకుండానే ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష మీ సొంతం అయ్యే అవకాశం, ఏం చేయాలంటే.?

First Published Dec 11, 2022, 7:51 PM IST

వ్యాపారం చేయడమే లక్ష్యంగా భావిస్తున్నారా అయితే మీ గ్రామంలోనే ఉంటూనే,  ప్రతినెల లక్షల్లో ఆదాయం పొందే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఇదంతా సాధ్యం కాదని భావిస్తున్నారా.  కానీ సాధ్యమే అని చాలామంది నిరూపిస్తున్నారు.  అంతే కాదు ప్రతి రోజు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు.  ఏం వ్యాపారం అని ఆలోచిస్తున్నారా.  అయితే  పూర్తి వివరాలు తెలుసుకోండి.
 

 వ్యవసాయ పరిశ్రమలో  అంతగా లాభం ఉండదని అందరూ నిరుత్సాహపరుస్తుంటారు.  కానీ  చక్కటి ప్లానింగ్,  అలాగే  వినూత్న పద్ధతులు అవలంబిస్తే,  మీరు ఉన్న గ్రామంలోనే నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.  అందుకు ఒక మార్గం తెలుసుకుందాం.  ఖర్జూరం గురించి అందరూ వినే ఉంటారు.  ఖర్జూరం అనగానే అందరికీ గుర్తొచ్చేది.  సౌదీ అరేబియా,  దుబాయ్, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలే గుర్తొస్తాయి.  కానీ ఖర్జూరపండు మన దేశంలో కూడా పండించే అవకాశం ఉంది.
 

 తాటి, ఈత చెట్టు జాతికి చెందిన ఖర్జూరం పంట మన దేశంలో కూడా పెద్ద ఎత్తున పండించవచ్చు.  ఇందుకోసం సరైన పద్ధతులు పాటిస్తే పెద్ద ఎత్తున  ఖర్జూరం ఉత్పత్తి చేయవచ్చు.  ముందుగా ఖర్జూరం మొక్కలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయో తెలుసుకుందాం. ఇసుకతో కూడిన ఎర్ర నేలలు, బంజరు భూముల్లో  ఇవి బాగా పెరుగుతాయి. ఖర్జూరం మొక్కలను  గుజరాత్ లోని కచ్ కార్పోరేషన్ ల్యాబ్స్, రాజస్థాన్లోని జోధ్ పూర్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కో మొక్క ఖరీదు సుమారు 3500 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఇది జీవితకాల పెట్టుబడి.  ఒక్క మొక్క సుమారు 60 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది.  
 

ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతంలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా ఖర్జూర పంటను సాగు చేస్తున్నారు. వారికి చాలా త్వరగానే ఆదాయం ప్రారంభమైంది. మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాలకి దిగుబడి ప్రారంభమైంది.  ఖర్జూర పంటకు నీరు అవసరం లేదు. కానీ వర్షాకాలంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చెట్ల వద్ద నీరు ఎక్కువగా నిలవకుండా జాగ్రత్తపడాలి.

మార్కెట్లో ఖర్జూరానికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రంజాన్ మాసంలోనూ,  అలాగే పండుగల సమయంలో ఖర్జూరం తినేందుకు ఎక్కువగా జనం ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇందులో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.  ముఖ్యంగా రక్తహీనత ఎక్కువగా ఉన్నవారికి ఖర్జూరం చాలా మంచిది. 
 

ఖర్జూరాన్ని నేరుగా వినియోగదారులకు విక్రయించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు.  ఇందుకోసం మీరు పట్టణాల్లో ఏర్పాటు చేసే సంతల్లో  వీటిని విక్రయిస్తే చక్కటి లాభం వస్తుంది.  అలాగే సూపర్ మార్కెట్లు,  మాల్స్, రైతు  బజార్లలో వీటిని విక్రయించవచ్చు.ఖర్జూరంతో పాటు పెసర వంటి అంతర పంటలను కూడా పెంచుకోవచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.  

click me!