Air India: రూ.599కే విమానం ఎక్కేయొచ్చు.. ఎయిర్ ఇండియా ఆఫర్ అదుర్స్ అంతే!

Published : Mar 18, 2025, 08:04 PM IST

Air India: దేశ ప్రజలకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.599 రూపాయలకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అందిస్తోంది. విమానంలో ప్రయాణించాలన్న మధ్య తరగతి వారి కలను నెరవేర్చాలన్న సంకల్పంతోనే ఈ టికెట్లు విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మరి ఇంత తక్కువ ధరకు ఏ రూట్లలో ప్రయాణించవచ్చో తెలుసుకుందామా?  

PREV
14
Air India: రూ.599కే విమానం ఎక్కేయొచ్చు.. ఎయిర్ ఇండియా ఆఫర్ అదుర్స్ అంతే!

ఇండియాలో విమానంలో ప్రయాణించాలని అందరికీ ఉంటుంది. ధనవంతులు ఈజీగా ఫ్లైట్ ఎక్కేయగలరు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించగలరు. కాని మధ్యతరగతి వాళ్లు విమానం ప్రయాణించాలని అనుకుంటారని, వారి కలను నెరవేర్చడం తమ బాధ్యత అని టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా భావించింది. అందుకే తక్కువ ధరకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అమ్ముతోంది.

 

24

ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ప్రీమియం ఎకానమీ టికెట్ ధరను కేవలం రూ. 599 నుంచి స్టార్ట్ చేసింది. ఇది సాధారణ ఎకానమీ ఫేర్ కంటే తక్కువ. ఈ ఆఫర్ రూట్, డిమాండ్‌ను బట్టి మారుతుంది. ఇండియాలో ప్రీమియం ఎకానమీని అందించే ఏకైక ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియానే కావడం విశేషం.

ఈ రూ. 599 ఆఫర్‌ను ఉపయోగించుకొని టికెట్ తీసుకున్న వారు ఎయిర్ ఇండియాకు చెందిన 39 డొమెస్టిక్ రూట్లలో ఏదైనా ఒక రూటులో ప్రయాణించవచ్చు.

 

34

వారానికి 50,000 సీట్లు

మధ్య తరగతి వారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. వారానికి 50,000 సీట్లను డిస్కౌంట్ ధరకు విక్రయించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఇప్పుడు ప్రీమియం ఎకానమీ సీట్లను 30% పెంచారు. దీంతో డిస్కౌంట్ ధరల్లో ప్రీమియం ఎకానమీ సీట్ల సంఖ్య వారానికి 65,000 దాటుతుంది. వీటిలో 34,000 సీట్లు మెట్రో నగరాల మధ్య ఉన్నాయి.

 

44

ఏఏ రూట్లలో ప్రయాణించొచ్చు

ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ రూట్లలో రూ. 599 నుంచి ఆఫర్ ధరతో ప్రీమియం ఎకానమీలో ప్రయాణించవచ్చు.

ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. ఫ్రీగా సీట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్-ఇన్, బోర్డింగ్, లగేజీకి ప్రయారిటీ కూడా ఉంటుంది.

ఇది కూడా చదవండి తక్కువ ఖర్చుతో ప్రపంచంలో చూడదగ్గ టాప్ 10 ప్రదేశాలు ఇవే

click me!

Recommended Stories