జియో తన వినియోగదారులకు అన్ లిమిటెడ్ 5G డేటాను అందించడానికి చక్కటి ఆఫర్ ని తీసుకొచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని జియో ఆశిస్తోంది. ఈ ఆఫర్ ఏంటంటే.. మీరు సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ 5G డేటాను ఆస్వాదించడానికి రూ.601 పెట్టి ‘జియో ట్రూ 5G గిఫ్ట్ వోచర్’ తీసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే సంవత్సరం మొత్తం 5జీ సేవలు పొందవచ్చు.
మీరు రూ.601 పెట్టి 5G అప్‌గ్రేడ్ గిఫ్ట్ వోచర్ ను తీసుకొని మై జియో యాప్ ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దీన్ని 4జీ వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పటికే 4జీ సేవలు పొందుతున్న జియో వినియోగదారులు 5జీ సేవలు పొందేందుకు ఈ వోచర్ ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
అయితే ఈ 5G డేటా వోచర్‌ను ఉపయోగించాలంటే ఇప్పటికే కనీసం 1.5 GB 4G డేటాకు నెలవారీ లేదా త్రైమాసిక ప్లాన్‌లో రీఛార్జ్ చేసి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే రోజుకు 1 GB డేటా ప్లాన్‌లో ఉన్న వారికి, రూ.1,899 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లో ఉన్న వారికీ ఈ వోచర్ పనిచేయదు. అంటే రోజుకు 1 GB డేటా వినియోగించే వారు 5G సేవలను పొందలేరు.
జియో ట్రూ 5G అపరిమిత డేటా గిఫ్ట్ వోచర్
వినియోగదారులు జియో ట్రూ 5G గిఫ్ట్ వోచర్‌ను తమకోసమే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా గిఫ్ట్ గా ఇవ్చొచ్చు. మై జియో యాప్ ద్వారా ఈ వోచర్ ని వేరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. అయితే మీరు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వారు ఈ వోచర్‌ను ఉపయోగించి అదనపు ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగి ఉండాలని మర్చిపోకండి. అంటే వారు కనీసం బేసిక్ ప్లాన్‌లో ఉన్నారో లేదో చెక్ చేసుకొని ఈ గిఫ్ట్ వోచర్ ఇవ్వండి.
జియో అపరిమిత 5G డేటా వోచర్ రూ.199, రూ.239, రూ.299, రూ.319, రూ.329, రూ.579, రూ.666, రూ.769, రూ.899 రీఛార్జ్ ప్లాన్‌లలో ఉన్నవారికి పనిచేస్తుంది. వినియోగదారుల బేసిక్ ప్లాన్‌ను బట్టి 5G డేటా వోచర్ చెల్లుబాటు ఉంటుంది. గరిష్టంగా 30 రోజులు చెల్లుబాటు అవుతుంది.
5G డేటా వోచర్ యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారులు 3 GB రోజువారీ 4G డేటాతో పాటు, అపరిమిత 5G డేటాను కూడా పొందుతారు. ఇది కాకుండా జియో రూ.51 (1 నెల), రూ.101 (2 నెలలు), రూ.151 (3 నెలలు) ధరలలో 5G వోచర్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.