Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? సింపుల్‌గా సిబిల్ స్కోర్ పెంచుకునే 6 సీక్రెట్ ట్రిక్స్ మీకోసం

Published : Oct 05, 2026, 02:06 PM IST

Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్లు రావడం కష్టమే. అయితే కొన్ని సింపుల్ అలవాట్లతో మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మళ్ళీ మెరుగుపరుచుకోవచ్చు. సిబిల్ స్కోర్ ను పెంచుకునే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
తక్కువ క్రెడిట్ స్కోర్‌తో ఇబ్బంది పడుతున్నారా?

క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకుల నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ లోన్ అప్లై చేసినా ప్రాసెస్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లకు లేదా కఠినమైన నిబంధనలతో లోన్లు ఇస్తుంటాయి.

గతంలో ఈఎంఐలు సరిగ్గా చెల్లించకపోవడం లేదా క్రెడిట్ కార్డును విపరీతంగా వాడటం వల్ల మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అలాంటప్పుడు వెంటనే మరో లోన్ తీసుకోవడం పరిష్కారం కాదు. అసలు స్కోర్ ఎందుకు తగ్గిందో తెలుసుకుని ఆ అలవాట్లను మార్చుకోవడమే అసలైన పరిష్కారం.

25
బిల్లులు సమయానికి చెల్లించండి

మీ క్రెడిట్ రిపోర్ట్‌లోని సమాచారం ఆధారంగానే క్రెడిట్ స్కోర్ లెక్క వేస్తారు. ఇందులో మీ రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్, కొత్తగా లోన్ల కోసం చేసిన ఎంక్వైరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్కోర్ పెరగడానికి అత్యంత ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రతీ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్లును ఆన్ టైమ్‌లో పే చేయడం.

బిల్లు లేట్ అయితే ఆ సమాచారం క్రెడిట్ బ్యూరోకు చేరుతుంది. దానివల్ల స్కోర్ దెబ్బతింటుంది. బిల్లులు మర్చిపోకుండా ఉండటానికి రిమైండర్లు సెట్ చేసుకోవడం లేదా ఆటో-డెబిట్ ఆప్షన్ ఎంచుకోవడం చాలా మంచిది.

35
క్రెడిట్ కార్డ్ లిమిట్ అదుపులో ఉంచుకోండి

క్రెడిట్ కార్డ్ వాడేవారు కేవలం మినిమమ్ అమౌంట్ మాత్రమే చెల్లించి ఊరుకోవడం సరికాదు. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ లేట్ ఫీజుల నుంచి తప్పించుకోవచ్చు కానీ, మిగిలిన బ్యాలెన్స్‌పై భారీగా వడ్డీ పడుతుంది. వీలైనంత వరకు డ్యూ డేట్ లోపు పూర్తి బిల్లును క్లియర్ చేయాలి.

అలాగే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను ఎంత వరకు వాడుతున్నారనేది కూడా ముఖ్యమే. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ రూ. 1 లక్ష ఉండి, మీరు రూ. 70,000 వాడితే మీ యుటిలైజేషన్ 70 శాతంగా ఉంటుంది. లిమిట్‌ను పూర్తిస్థాయిలో వాడేస్తే మీరు అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. కాబట్టి వాడకాన్ని ఎప్పుడూ పరిమితిలోనే ఉంచాలి.

45
పాత బాకీలు పూర్తి చేసి రిపోర్ట్ చెక్ చేయండి

మీకు ఏవైనా పాత బాకీలు ఉంటే ముందుగా వాటిని చెల్లించి క్లియర్ చేయండి. పాత బాకీలు తీర్చిన వెంటనే క్రెడిట్ రిపోర్ట్ మారిపోదు కానీ, వాటిని అలాగే వదిలేస్తే వడ్డీలు, అదనపు ఛార్జీలు పెరిగి సమస్య ఇంకా పెద్దదవుతుంది. బాకీ తీర్చే ముందు బ్యాంక్ నుంచి అసలు అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోండి.

పేమెంట్ పూర్తయ్యాక రసీదును భద్రంగా ఉంచుకోండి. కొన్నాళ్ళ తర్వాత మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఆ వివరాలు అప్‌డేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఏటా నాలుగు క్రెడిట్ బ్యూరోల నుంచి ఒక ఉచిత క్రెడిట్ రిపోర్ట్ పొందే అవకాశం ఉంటుంది. అందులో ఏవైనా తప్పులు ఉన్నాయేమో పరిశీలించండి.

55
పాత కార్డులు, కొత్త అప్లికేషన్లపై జాగ్రత్త

ఒక చోట లోన్ రిజెక్ట్ కాగానే వెంటనే వరుసగా వేర్వేరు బ్యాంకుల్లో అప్లై చేయకండి. తక్కువ సమయంలో ఎక్కువ అప్లికేషన్లు పెడితే బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో హార్డ్ ఎంక్వైరీ చేస్తాయి. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. లోన్ అప్లై చేసే ముందు అర్హత నిబంధనలు చెక్ చేసుకోవడం బెటర్.

ఇకపోతే, పాత క్రెడిట్ కార్డులను వెంటనే క్లోజ్ చేయకండి. పాత కార్డ్స్ ద్వారా మీ మంచి రీపేమెంట్ హిస్టరీ వ్యక్తమవుతుంది. అయితే, వార్షిక ఫీజులు ఎక్కువగా ఉంటే లేదా అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని అనిపిస్తే మాత్రం క్లోజ్ చేయడం మంచిదే.

Read more Photos on
click me!

Recommended Stories