మీ ఎటిఎం లేదా క్రెడిట్ కార్డ్ పోయిందా ? ఈజీగా బ్లాక్ చేయడం ఎలా అంటే..?

First Published Aug 7, 2024, 1:58 PM IST

ఈరోజుల్లో డెబిట్ కార్డ్స్  లేదా క్రెడిట్ కార్డ్స్  ఉపయోగించని వారు తక్కువ. ఎక్కడి నుండైనా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి, ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్  చేయడానికి ఇవి సహకరిస్తాయి. క్రెడిట్ కార్డ్స్  ద్వారా షార్ట్ టర్మ్  లోన్స్ పొందడం ఆమోదాన్ని పెంచింది. 
 

డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా, కొన్నిసార్లు అవి పోయినట్లయితే వాటిని వెంటనే బ్లాక్ చేయడం మంచిది. 
 

డెబిట్/క్రెడిట్ కార్డ్స్  ఎలా బ్లాక్ చేయాలి?

మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేయవచ్చు. ఇందుకు కొన్ని బ్యాంకులు కస్టమర్లకు SMS ద్వారా లేదా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కార్డ్స్  బ్లాక్ చేయడానికి సహాయపడతాయి. మీరు మీ దగ్గరలోని బ్యాంకుకి వెళ్లడం  ద్వారా ఆఫ్‌లైన్‌లో డెబిట్/క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడం సాధ్యపడుతుంది. మీరు ఆన్‌లైన్‌లో చేస్తున్నప్పుడు మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కార్డ్‌లను బ్లాక్ చేయవచ్చు. 

Latest Videos


నెట్ బ్యాంకింగ్ & మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ని ఓపెన్ చేసి  డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాల విభాగానికి వెళ్లండి. కార్డ్‌ని బ్లాక్ చేయడానికి అప్షన్  సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కార్డును బ్లాక్ చేయడానికి గల కారణాలను పేర్కొనండి. చివరికి సబ్మిట్ నొక్కండి. మరోసారి  కన్ఫర్మేషన్  కోసం అడుగుతుంది,ఓకే చేయండి. 
 

డెబిట్ & క్రెడిట్ కార్డులను SMS ద్వారా కూడా బ్లాక్ చేయవచ్చు. బ్యాంకు అందించిన నంబర్‌కు నిర్ణయించిన  ఫార్మాట్ ప్రకారం SMS పంపాలి. కార్డ్ బ్లాక్ అయిన తర్వాత బ్యాంక్ కన్ఫర్మేషన్ మెసేజ్ పంపుతుంది.

బ్యాంక్ టోల్ ఫ్రీ ఫోన్ బ్యాంకింగ్ నంబర్‌ను కాల్ చేయడం ద్వారా కస్టమర్‌లు కార్డ్‌లను బ్లాక్ చేయవచ్చు

click me!