Bank loan: సాలరీ స్లిప్పులు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ఎలా?

Published : Nov 17, 2025, 10:10 AM IST

Bank loan: చాలామంది జీతం స్లిప్పులు ఉంటేనే బ్యాంకు నుంచి లోన్ తీసుకోగలమని అనుకుంటారు. నిజానికి కొన్ని పెద్ద బ్యాంకులు జీతం స్లిప్పు లేకపోయినా కూడా మీకు పర్సనల్ లోను, హోమ్ లోన్, కార్ లోన్ వంటివి ఇస్తాయి. దీనికోసం ఏం చేయాలో తెలుసుకోండి. 

PREV
13
పే స్లిప్స్ లేకపోతే లోన్ రాదా?

ఇప్పుడు అందరికీ లోన్ అవసరమే. పర్సనల్ లోన్ నుంచి కారు లోన్, హోమ్ లోన్ వంటివి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు ఈ లోన్లు రావడం చాలా సులభం. జీతం స్లిప్పులు ఇస్తే చాలు బ్యాంకులో వెంటనే రుణాలను అందిస్తాయి. కానీ కొంతమందికి ఆదాయం ఉన్నా కూడా జీతం స్లిప్పులు ఉండవు. ముఖ్యంగా వ్యాపారంలో చేసే వారికి ఇలాంటి సమస్య వస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తున్నా కూడా ఎలాంటి జీతం స్లిప్పులు లేకపోవడం వల్ల బ్యాంకు నుంచి లోన్ పొందడం కష్టమని అనుకుంటారు. ఇలాంటివారు కూడా కొన్ని బ్యాంకులు నుంచి పొందవచ్చు.

23
ఈ పత్రాలు అవసరం

బ్యాంకు మీరు తీసుకున్న అప్పును కట్టగలిగే సత్తా మీకు ఉందని నమ్మితే చాలు మీకు లోన్ ఇచ్చేస్తాయి. కాబట్టి మీ ఆదాయం వనరును బ్యాంకుకు స్పష్టంగా తెలియజేయాలి. అందుకు కావలసిన పత్రాలను బ్యాంకుకు ఇవ్వాలి. జీతం స్లిప్పులు లేనివారు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ను చూపించండి. ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ను అందించినా చాలు.. కొన్ని పెద్ద బ్యాంకులు మీకు లోన్లను ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకులో ఏడాది స్టేట్మెంట్ లను కూడా అడగవచ్చు. కాబట్టి ఆ స్టేట్మెంట్లను కూడా సిద్ధం చేసుకుంటే మంచిది. అలాగే రెండు సంవత్సరాల ఫారం 16 లేదా ఆదాయపు పన్ను రిటర్స్న్ అంటే ఐటిఆర్ కాపీని కూడా అవసరం పడుతుంది. ఇక క్రెడిట్ స్కోరు కూడా చెక్ చేస్తుం.ది ఇది కూడా మీకు రుణం పొందే అవకాశాలను పెంచుతుంది.

33
ఇలా చేయండి

జీతం స్లిప్పులు లేవని లోన్ రాదని అనుకోకండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు మీ ఆదాయ వనరులు అలాగే ఐటిఆర్ ఫామ్ 16 వంటివి బ్యాంకుకు అందించి లోన్ కోసం ప్రయత్నించండి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని పెద్ద బ్యాంకులు జీతం స్లిప్పులు లేకపోయినా కూడా లోన్ అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఆ బ్యాంకులు గురించి ముందుగా వాకబు చేయండి. ఆ తర్వాత అక్కడ ఉన్న ఉద్యోగులతో మాట్లాడి మీ పరిస్థితిని చెప్పం.డి వారు అడిగిన పత్రాలను అందించండి. శాలరీ పే స్లిప్స్ లేకపోయినా కూడా మీరు అవసరమైనప్పుడు రుణాన్ని పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories