మీ ఫోన్ స్క్రీన్‌ క్లీన్ చేయడానికి సూపర్ టిప్స్ ఇవిగో

First Published Sep 4, 2024, 8:22 PM IST

చాలా మంది తమ ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి వారి క్లాత్స్ వాడుతుంటారు. అంటే షర్ట్ కో, ఫ్యాంటుకో  రుద్దేస్తుంటారు. ఇది చాలా డేంజర్. మీ ఫోన్ స్క్రీన్ దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సారి స్క్రీన్ ఊడిపోవడం కూడా జరగవచ్చు. అలా జరగకుండా ఈ టిప్స్ పాటిస్తే మీ ఫోన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. 

మీ ఫోన్‌ స్క్రీన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా శుభ్రం చేయడం వల్ల పరికరం దెబ్బతింటుంది. మీ ఫోన్‌ను శుభ్రం చేయడానికి ఏది సరైన విధానమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటినే పాటించడం వల్ల మీ ఫోన్ దెబ్బతినకుండా ఉంటుంది. 

ఫైబర్ కాటన్ తో తుడవండి..

మీ ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి ఫైబర్ కాటన్‌ను ఉపయోగించండి. ఇది స్క్రీన్‌పై గీతలు పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరికరానికి ఎలాంటి నష్టం జరగకుండా నిరోధిస్తుంది. కాటన్ లో చాలా స్మూత్ గా ఉండటం వల్ల తుడిచినప్పుడు దుమ్మును లోపలికి లాగేసుకుంటుంది. ఇతర వాటితో శుభ్రం చేయడం వల్ల దుమ్ములో ఉండే రేణువులు గీతలు పడేలా చేస్తాయి.  

Latest Videos


నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదం

మీ ఫోన్ స్క్రీన్‌ను నీటితో తుడవడం వల్ల అది దెబ్బతింటుంది. ఎందువల్ల అంటే స్క్రీన్ పై ఉండే కంటికి కనిపించని స్క్రాచస్ లోకి నీరు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా స్పీకర్ హోల్స్ లోకి, మైక్ లోకి నీరు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పొరపాటున అలా జరిగితే  మీరు రిపేర్ కోసం చాలా ఖర్చు పెట్టక తప్పదు. అందువల్ల మీ ఫోన్‌ను శుభ్రం చేయడానికి ఎప్పుడూ నీటిని ఉపయోగించకూడదు.

ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు..

ఆడవాళ్ల వద్ద మేకప్ రిమూవర్‌ వంటి వివిధ రకాల లిక్విడ్లు, టూల్స్ ఉంటాయి. సాధారణంగా వాటితోనూ ఫోన్ స్క్రీన్ శుభ్రం చేసేస్తుంటారు. దీని వల్ల కూడా స్క్రీన్‌ దెబ్బతింటుంది. కాలక్రమేణా ఫోన్‌లో ఇతర సమస్యలకు దారితీస్తుంది. 

డెట్టాల్ అసలు ఉపయోగించొద్దు..

కొందరు ఫోన్ శుభ్రత కోసం ఇంట్లో వాడే డెట్టాల్‌ ఉపయోగిస్తుంటారు. ఇది క్రిములు నాశనం చేస్తుంది కనుక స్క్రీన్ పై ఉండే డస్ట్ ని కూడా శుభ్రం చేస్తుంది అనుకుంటారు. అయితే డెట్టాల్ లో బెంజీన్ ఉంటుంది. కాబట్టి డెట్టాల్‌తో ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయవద్దు. ఇది ఫోన్ స్క్రీన్ కి, బాడీకి నష్టం కలిగిస్తుంది. 

ఇలా చేయడమే బెటర్

మార్కెట్ నుండి కొనుగోలు చేసిన ఖరీదైన ఫోన్ క్లీనర్‌ని ఉపయోగించడం సురక్షితం. ఎందుకంటే ఇది పరికరాన్ని రక్షించడంతో పాటు క్లీనింగ్ కూడా బాగా జరుగుతుంది. ఇలాంటి లిక్విడ్లు వాడటం వల్ల ఫోన్ దెబ్బతినకుండా ఉంటుంది. 

ఇలా చేయడం కూడా మంచిదే..

మీరు మీ ఫోన్ స్క్రీన్ ను శుభ్రం చేయాలనుకుంటే కాటన్ బాల్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్‌తో రుద్దడం ద్వారా శుభ్రం చేయవచ్చు. ఇది ఫోన్ యొక్క ఉపరితలం నుండి దుమ్ము, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ ఫోన్ శుభ్రపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

click me!