4జీ నెట్‌వర్క్ సౌకర్యం కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కి కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లకు పైగా గ్రాంట్‌ను ప్రకటించనుంది. 4G నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అధునాతన పరికరాల కొనుగోలు కోసం కేంద్రం స్వయంగా అంతర్గత పెట్టుబడి పెడుతోంది. ఇది BSNLకు ఎంతో సహాయం చేసే స్టెప్ అని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లను నిలుపుకోవడానికి ఈ చర్య సహాయపడుతుందంటున్నారు. 4జీ నెట్ వర్క్ పూర్తిస్థాయిలో పనిచేస్తే బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ ఇన్‌వార్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DoT) త్వరలో క్యాబినెట్ నుండి ఆమోదం పొందనుందని సమాచారం. గత సంవత్సరం BSNL 1,00,000 4G సైట్‌ల కోసం 19,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ కొనుగోలు ఆర్డర్ చేసింది. ఇప్పుడు 13,000 కోట్లకు అసలు కొనుగోలు ఆర్డర్‌ను ఉంచారు. దీంతో ఇప్పుడు రూ.6 వేల కోట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం 2019 నుండి BSNL, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(MTNL)లను కొనుగోలు చేసింది. మూడు పునరుద్ధరణ ప్యాకేజీల కింద ప్రభుత్వం రూ. 3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ప్యాకేజీల కారణంగా BSNL, MTNL FY 2021 నుండి నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. ప్రస్తుతం BSNL నెమ్మదిగా 4G సేవలను అందిస్తోంది.
టెలికాం మార్కెట్లో BSNL వాటా జూన్ 2024 నాటికి 7.33 శాతంగా ఉంది. డిసెంబర్ 2020 నాటికి BSNL 10.72% వాటాను కలిగి ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియోకు 40.71% వినియోగదారులు, ఎయిర్‌టెల్‌కు 33.71% వినియోగదారులు ఉన్నారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన CDoT-TCS స్టాక్ ఆధారంగా 4G నెట్‌వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వం BSNLని ఆదేశించింది. కానీ ఈ లోకల్ స్టాక్ టెస్టింగ్ ప్రాసెస్ కారణంగా 4G నెట్‌వర్క్ సేవ ఆలస్యం అవుతోంది. అయితే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందుకే మూడు కంపెనీలు కస్టమర్లకు స్మార్ట్ ఆఫర్లను అందిస్తున్నాయి.
BSNL అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లు ఇవిగో..
1. రూ.399 ప్లాన్: ఈ ప్లాన్ చెల్లుబాటు 80 రోజులు. 1 GB డేటాతో పాటు 100 SMS రోజువారీ ఇస్తారు. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
2. రూ.499 ప్లాన్: ఈ ప్లాన్ చెల్లుబాటు 90 రోజులు. రోజుకు 1.5 GB డేటాతో పాటు 100 SMS వస్తాయి. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాట Zing యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు.
3. రూ.997 ప్లాన్: దీనికి 180 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్. రోజువారీ 3 GB డేటా, 100 SMS, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
4. రూ.1,999 ప్లాన్ : ఇది సంవత్సరం మొత్తం చెల్లుబాటు అయ్యే ప్లాన్. 2 GB రోజువారీ డేటా, 100 SMS, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత లోకల్ & నేషనల్ రోమింగ్ కాల్‌లు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది.
5. రూ.2,399 ప్లాన్: ఇది కూడా 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్. 3 GB డేటా రోజువారీ100 SMS అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత PRBT, BSNL ట్యూన్‌లకు ఉచిత సభ్యత్వం అవకాశం ఉంది.