కాఫీలో ఎలాగైతే రకాలు ఉంటాయో, క్రెడిట్ కార్డ్స్‌లో కూడా రకాలు ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్టుగా వీటిని ఎంచుకోవాలి:
1. రివార్డ్స్ క్రెడిట్ కార్డ్స్: మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిపై క్యాష్ బ్యాక్, పాయింట్లు వస్తాయి. రెగ్యులర్ షాపింగ్ చేసేవారికి ఇవి బెస్ట్.
2. ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్: మీరు తరచుగా ప్రయాణాలు చేస్తుంటే, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి సౌకర్యాలు లభిస్తాయి.
3. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కార్డ్స్: పాత కార్డ్‌లో అప్పు ఎక్కువైపోయి, వడ్డీ కట్టలేకపోతుంటే.. ఆ అప్పును తక్కువ వడ్డీ ఉన్న కొత్త కార్డ్‌లోకి మార్చుకోవచ్చు.
4. బిజినెస్ క్రెడిట్ కార్డ్స్: వ్యాపారస్తులు, ఫ్రీలాన్సర్ల కోసం ఇవి బెస్ట్. ఆఫీస్ సప్లైస్, బిజినెస్ ట్రావెల్‌పై వీటికి ఎక్కువ రివార్డులు ఉంటాయి.