ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు..బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎంత ఆదాయం రావచ్చు..

Published : Nov 09, 2022, 11:53 AM IST

ఎలాన్ మాస్క్ ట్విట్టర్ అధినేత అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొత్త పుంతలు తొక్కుతోంది . ముఖ్యంగా ట్విట్టర్ బ్లూటిక్ విషయంలో ఎలాన్ మాస్క్ తీసుకున్న నిర్ణయం ఆ కంపెనీ ఆదాయాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

PREV
16
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు..బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎంత ఆదాయం రావచ్చు..
Twitter

నిజానికి ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఈ స్థాయిలో సక్సెస్ అయిందంటే అందులోని సెలబ్రిటీ ఫాలోయర్లే ప్రధాన కారణం. అయితే వారికి బ్లూటిక్ ఇవ్వడం ద్వారా ట్విట్టర్ లో వచ్చే సందేశాలకు విశ్వసనీయత పెరిగింది ఆ తర్వాత నుంచి బ్లూటిక్ అనేది ఒక ట్రేడ్ మార్క్ గా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం ఈ బ్లూటిక్ విషయంలో ఎలాన్ మాస్క్ కాస్త కమర్షియల్ గా ఆలోచిస్తున్నారని వాదన వినిపిస్తోంది.

26

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కి కొత్త బాస్‌గా మారినప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నిసార్లు మస్క్ ఉద్యోగులను 12 గంటలు పని చే యాలని హెచ్చరిస్తుంటే, మరోవైపు పెద్ద ఎత్తున తొలగింపుల కారణంగా, మస్క్ ముఖ్యాంశాల్లో నిలుస్తున్నారు.  

36

ఇప్పుడు ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఆయన వసూలు చేస్తున్న నెలవారీ చార్జీ చర్చనీయాంశమైంది. మస్క్ ఇటీవల ట్వీట్ చేస్తూ, ఇప్పుడు వినియోగదారులు బ్లూ టిక్ కోసం ప్రతి నెలా  8 డాలర్లు చెల్లించాలి అంటే దాదాపు రూ. 660 చెల్లించాలంటూ ట్వీట్ చేశాడు. 
 

46

కొత్త ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసంనెలకు 19.99 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో నెలకు రూ. 1,600 వసూలు చేయవచ్చని కొన్ని నివేదికలలో ముందుగా వినిపిస్తోంది. ఇప్పుడు బ్లూ టిక్ ధర నెలకు 8 డాలర్లుగా ఖరారు చేయబడింది. సహజంగానే, ట్విట్టర్‌కు కూడా దీని ద్వారా ఆదాయం వస్తుంది.

56
మస్క్ ఆదాయం ఎంత పెరుగుతుంది?

2021 నాటికి, 400 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ట్విట్టర్‌లో దాదాపు 4 లక్షల వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్నాయి. వెరిఫైడ్ ట్విట్టర్ వినియోగదారులందరూ పేమెంట్ సర్వీసు కోసం సైన్ అప్ చేస్తే, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు నెలకు అదనంగా 3.2 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఇస్తుంది. అయితే బ్లూ టిక్‌ల కోసం 80 శాతానికి పైగా ట్విటర్ యూజర్లు డబ్బులు చెల్లించబోమని చెప్పినట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

66

ప్రస్తుతానికి ట్విట్టర్ నుండి ఈ తాజా చర్య ఎంత ఆదాయాన్ని ఆర్జించగలదో అంచనా వేయడం కష్టం. ముఖ్యంగా, ఏప్రిల్-జూన్ కాలంలో ట్విట్టర్ కంపెనీ  270 మిలియన్ డాలర్ల నష్టంలో ఉంది, దాని ఆదాయం 1 శాతం పడిపోయి 1.18 బిలియన్లకు చేరుకుంది. మస్క్ టెస్లాతో సహా 6 కంపెనీలకు సహ వ్యవస్థాపకుడు, ఇందులో స్పేస్‌ఎక్స్ మరియు ది బోరింగ్ కంపెనీ ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories