అప్పుడు అదానిపై ఆరోప‌ణ‌లు.. ఇప్పుడు మూత‌ప‌డుతున్న హిండెన్‌బర్గ్ - అసలు ఏం జ‌రిగింది?

First Published | Jan 16, 2025, 10:20 AM IST

Hindenburg: హిండెన్ బ‌ర్గ్ మూసివేత వెనుక ఎలాంటి భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య సమస్యలు లేవని నాథన్ ఆండర్సన్ తెలిపారు. గ‌తంలో ఈ సంస్థ అదాని పై తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో సంచ‌ల‌నం రేపింది. 
 

hindenburg: అదానీ గ్రూప్‌పై తమ నివేదికతో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన అమెరికాకు చెందిన షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. అప్పుడు అదాని గ్రూప్ పై సంచలన రిపోర్టులు ప్రచురించిన హిడెన్ బర్గ్ ఇప్పుడు మూత పడుతోంది.

అయితే, హిండెన్ బర్గ్ మూసివేతకు సంబంధించి ఎలాంటినిర్దిష్ట కారణాన్ని నాథన్ ఆండర్సన్ వెల్లడించారు. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్ తన జీవితంలో  ఎప్పుడూ అతిపెద్ద ప్రధాన విషయం కాలేదనీ, దీనిని ఒక అధ్యాయంగా చూస్తున్నానని పేర్కొన్నారు. 
 

హిండెన్ బర్గ్ మూసివేత గురించి నాథన్ ఆండర్సన్ ఏం చెప్పారు?

అదానీ గ్రూప్‌తో సహా పలు వ్యాపార సంస్థలపై సంచలన రిపోర్టులు ఇచ్చిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ను మూసివేస్తున్న‌ట్టు వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ తెలిపారు. దీనిపై వివ‌ర‌ణ‌తో ఒక నోట్ రాశారు. అందులో "నేను హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాను. మేము పని చేస్తున్న ఆలోచనల పైప్‌లైన్ పూర్తయిన తర్వాత ముగించాలనేది ప్రణాళిక" అని ఆయన హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌లో ఒక నోట్‌లో తెలిపారు.

అలాగే, ఎందుకు మూసివేస్తున్నామ‌నే విష‌యంపై కూడా ప్ర‌త్యేక కార‌ణాలు వెల్ల‌డించ‌లేదు. కానీ, "ఇప్పుడు ఎందుకు రద్దు చేయాలి? అనే ప్ర‌శ్న‌కు ఒక నిర్దిష్ట కార‌ణం గానీ,  విషయం గానీ లేదు.. హిండెన్ బ‌ర్గ్ మూసివేత వెనుక ప్ర‌త్యేక ముప్పు లేదు, ఆరోగ్య సమస్య లేదు, పెద్ద వ్యక్తిగత సమస్య లేదు.. ఎలాంటి భ‌యాలు లేవు" అని ఆండర్సన్ నోట్‌లో అన్నారు.


జీవితంలో జరిగే కొన్ని విషయాల్లో హిండెన్ బర్గ్ ఒకటి :  నేట్ ఆండ‌ర్స‌న్

జీవితంలో చాలా విష‌యాలు జ‌రుగుతాయ‌నే ప్ర‌స్తావ‌న‌తో హిండెన్ బ‌ర్గ్ త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని విష‌యాల్లో ఒక‌ట‌నీ, ఇదే అతిపెద్ద ముఖ్య‌మైన విష‌యం కాద‌ని కూడా నేట్ ఆండ‌ర్స‌న్ త‌న నోట్ లో పేర్కొన్నాడు. "ఒకానొక సమయంలో ఒకరు నాతో ఒక విజయవంతమైన కెరీర్ స్వార్థ చర్య అవుతుందని చెప్పారు. ప్రారంభంలో, నేను నాకు నేనే కొన్ని విషయాలను నిరూపించుకోవాలని భావించాను. నేను ఇప్పుడు చివరకు నాతో కొంత సంతృప్తిని కనుగొన్నాను, బహుశా నా జీవితంలో మొదటిసారి" అని పేర్కొన్నారు.

అలాగే, 'ఒకానొక దశలో విజయవంతమైన కెరీర్ స్వార్థపూరిత చర్యగా మారుతుందని ఒకసారి ఎవరో నాతో అన్నారు. మొదట్లో, నాకు నేను కొన్ని విషయాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. నేను ఇప్పుడు నాతో కొంత ఓదార్పును కనుగొన్నాను, బహుశా నా జీవితంలో మొదటిసారి. నన్ను నేను వదిలేసి ఉంటే బహుశా నాకు ఈ పరిస్థితి ఉండేది, కానీ నేను మొదట కొంచెం బాధ‌ను అనుభవించాలి. తీవ్రత, దృష్టి ప్రపంచంలోని చాలా మందిని, నేను శ్రద్ధ వహించే వ్యక్తులను కోల్పోయింది. నేను ఇప్పుడు హిండెన్ బ‌ర్గ్ ను  నా జీవితంలో ఒక అధ్యాయంగా చూస్తున్నాను, నన్ను నిర్వచించే ప్రధాన విషయం కాదు" అని ఆయన అన్నారు.

హిండెన్ బ‌ర్గ్ ఎప్ప‌టివ‌ర‌కు మూసివేస్తారు?

హిండెన్ బ‌ర్గ్ ను ఎప్ప‌టివ‌ర‌కు పూర్తి చేస్తామ‌నే విష‌యంపై ప్ర‌త్యేక తేదీని ప్ర‌క‌టించ‌లేదు కానీ, ప్ర‌స్తుతం సంస్థ నిర్వ‌హిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన త‌ర్వాత ముగించాల‌నేది త‌మ ప్ర‌ణాళిక‌గా ఉంద‌ని నేట్ ఆండ‌ర్స‌న్ పేర్కొన్నారు.  "మేము పని చేస్తున్న ఆలోచనల పైప్‌లైన్ పూర్తయిన తర్వాత ముగించాలనేది ప్రణాళిక. మేము పూర్తి చేసిన చివరి పోంజీ కేసుల ప్రకారం.. విష‌యాలు  నియంత్రణ సంస్థలతో పంచుకుంటున్నాము" అని ఆయన బుధవారం (జనవరి 15) హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో పేర్కొన్నారు.

Hindenburg Research

నా కుటుంబానికి ఈ రంగంలో అనుభవం లేదు.. :  నేట్ ఆండ‌ర్స‌న్

 

 

హిండెన్ బ‌ర్గ్ మూసివేత ప్ర‌క‌ట‌న నోట్ లో నేట్ అండర్సన్ సంస్థ ప్రారంభాల గురించి కూడా ప్ర‌స్తావించారు. సంస్థ ప్రారంభంలో తాను, సంస్థ ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను కూడా పేర్కొన్నారు. ప్రత్యేకించి అతని కుటుంబ సభ్యులెవరికీ ఈ రంగంలో అనుభవం లేదని తెలిపారు. 

"నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నేను స్లిమ్ సేల్స్ పర్సన్ ని కాదు. నాకు వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. నేను గోల్ఫ్ ఆడలేను. నేను 4 గంటల నిద్రలో పనిచేయగల సూపర్ హ్యూమన్ ని కాదు. అయితే, చాలా ఉద్యోగాలలో నేను మంచి కార్మికుడిని, కానీ ఎక్కువగా చూసుకునేవాడిని. నేను ప్రారంభించినప్పుడు నా వద్ద డబ్బు లేదు.. 3 కేసులను పట్టుకున్న తర్వాత కూడా నా వద్దకు త్వరగా డబ్బు రాలేదు" అని అతను చెప్పాడు.

ఆర్థిక వనరులు లేకపోయినా కేసులను ముందుకు తీసుకెళ్లిన ప్రపంచ స్థాయి విజిల్ బ్లోయర్ లాయర్ బ్రయాన్ వుడ్ మద్దతు లేకపోతే నేను ఆరంభంలోనే విఫలమయ్యేవాడిని. నాకు నవజాత శిశువు ఉంది. ఆ సమయంలో బహిష్కరణను ఎదుర్కొంటున్నాను. నేను భయపడ్డాను, కానీ నేను నిశ్చలంగా ఉంటే నేను కుప్పకూలిపోతానని తెలుసు. ముందుకు సాగడమే నాకున్న ఏకైక మార్గం' అని తెలిపాడు.

అదానీ-హిండెన్ బర్గ్ వివాదం ఏమిటి?

 

అదానీ గ్రూప్ షేరు ధరలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ హిండెన్బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో తన నివేదికలో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఈ ఆరోపణలతో కంపెనీ షేరు విలువ గణనీయంగా పడిపోయి దాదాపు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోయింది.

ఈ వివాదం పార్లమెంటులో తీవ్ర దుమారం రేపడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా కొన్ని వాస్తవాలను వక్రీకరించారని ఆరోపిస్తూ షార్ట్ సెల్లర్ కు సెబీ నోటీసులు జారీ చేసింది.

Latest Videos

click me!