హీనెకెన్ బీర్ కంపెనీ అవుట్.. వేల కోట్ల నష్టం.. క్షమాపణలు చెప్పి కారణాలను వెల్లడించిన సంస్థ...

First Published | Aug 26, 2023, 11:58 AM IST

డచ్ బ్రూవర్ హైనెకెన్(Heineken ) రష్యా నుండి వైదొలగుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కంపెనీ  కార్యకలాపాలను ఆర్నెస్ట్ గ్రూప్‌(Arnest Group)కు విక్రయించింది, ఈ గ్రూప్‌ కాస్మెటిక్స్, గృహోపకరణాలు, మెటల్ ప్యాకేజింగ్‌లో అతిపెద్ద రష్యన్ తయారీదారి. 

హీనెకెన్  ఇతర ప్రముఖ  వెస్టర్న్ కంపెనీ  లాగానే  రష్యాలో ఉనికిని నిలిపివేసేందుకు గత సంవత్సరం ప్రతిజ్ఞ చేసింది. అయినప్పటికీ, రష్యాలో ఇప్పటికీ సేల్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డచ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్‌సైట్ నివేదించాక  ఈ సంవత్సరం ప్రారంభంలో  విమర్శలను ఎదుర్కొంది. 

మార్చిలో రష్యా  నుండి వైదొలగడానికి సంబంధించి "అస్పష్టత" సృష్టించినందుకు కంపెనీ క్షమాపణలు చెప్పింది. మా రష్యన్ ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే  రష్యన్ వ్యాపారం కోసం కొనుగోలుదారులని కనుగొనడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించింది.
 


శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, హీనెకెన్ విక్రయానికి అవసరమైన అన్ని అనుమతులు లభించాయని ఇంకా  రష్యా నుండి వైదొలగడానికి  మార్చి 2022లో ప్రారంభించిన ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ చర్య మొత్తం 300 మిలియన్ యూరోల ($320 మిలియన్లు) నష్టానికి దారి తీస్తుందని అంచనా.
 

హీనెకెన్ ప్రకటన ప్రకారం రష్యాలోని ఏడు బ్రూవరీలతో సహా మిగిలిన అన్ని ఆస్తులు ఇప్పుడు కొత్త యాజమాన్యానికి  మారతాయి. ఆర్నెస్ట్ గ్రూప్ రష్యాలోని 1,800 మంది హీనెకెన్ ఉద్యోగులకు వచ్చే మూడేళ్లపాటు ఉపాధి హామీని అందించింది.

ఇంకా, 2022లో రష్యా నుండి హీనెకెన్ బ్రాండ్‌ను తొలగించడంతో పాటు ఆమ్‌స్టెల్ ఉత్పత్తి ఆరు నెలల్లో దశలవారీగా నిలిపివేయబడుతుంది. రష్యాలో ఇతర అంతర్జాతీయ బ్రాండ్‌లు ఏవీ లైసెన్స్ పొందబోవని హీనెకెన్ పేర్కొన్నారు.

హీనెకెన్  CEO డాల్ఫ్ వాన్ డెన్ బ్రింక్ "మేము ఇప్పుడు రష్యా నుండి మా తొలగింపు ప్రక్రియ  పూర్తి చేసాము." అని అన్నారు. రష్యా నుండి వొదిలి వెళ్ళేటప్పుడు పెద్ద తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన అంగీకరించారు అలాగే ఈ లావాదేవీ వారి ఉద్యోగుల జీవనోపాధికి భరోసా ఇస్తూ బాధ్యతాయుతంగా దేశం నుండి నిష్క్రమించడానికి వీలు కల్పిస్తుందని ఉద్ఘాటించారు.

Latest Videos

click me!