బెస్ట్ అప్ డేట్ ఫీచర్లు.. బ్రిలియంట్ టెక్నాలజీ.. కొత్త కెటియం డ్యూక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

First Published | Aug 26, 2023, 11:33 AM IST

 ఆస్ట్రేలియన్ ఆధారిత బైక్ తయారీ కంపెనీ కెటియం  బైక్‌లు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సందర్భంగా కంపెనీ ఇప్పుడు మరో కొత్త మోడల్ బైక్‌ను పరిచయం చేసింది.
 

ప్రపంచవ్యాప్తంగా, KTM  కొత్త డ్యూక్ 390 (2024) మోడల్ బైక్‌ను విడుదల చేసింది. ఒకట్రెండు నెలల్లో ఈ బైక్ ప్రజలకి  అందుబాటులోకి వస్తుందని కూడా  ప్రకటించారు. 

ఫ్రెష్ Vs ఓల్డ్ 

కంపెనీ ప్రకారం, ఈ కొత్త KTM డ్యూక్ 390 పాత మోడల్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ బైక్  పాత మోడల్ కంటే పెద్ద పెట్రోల్ ట్యాంకులు, స్ప్లిట్ సీట్   అండ్   స్ట్రోనాట్ బిల్ట్ క్వాలిటీతో పెద్ద బాడీ ఉంటుంది. 

KTM 890 Adventure R

 బరువు, సస్పెన్షన్ అండ్  బ్రేక్‌లు 

దాదాపు 165 కిలోల బరువున్న ఈ బైక్ పూర్తిగా కాస్ట్ అల్యూమినియంతో తయారు చేయడం గమనార్హం. కొత్త డ్యూక్ 390 బైక్‌లో 43 ఎంఎం యుఎస్‌డి టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనో షాప్ సెటప్  ఆమర్చినట్లు తెలిపారు. దీనికి ముందువైపు 320ఎంఎం డిస్క్ బ్రేక్ ఇంకా వెనుకవైపు 240ఎంఎం డిస్క్ బ్రేక్  ఉంది. 
 


వీల్స్   అండ్ ఇతర ఫీచర్స్ 

ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. అలాగే బ్లూటూత్ ఫీచర్‌తో కూడిన 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడి ఉంటుంది. దీనిని స్మార్ట్ ఫోన్ కి  కనెక్ట్   చేసుకుకోవచ్చు.

ఇంజన్ సామర్థ్యం అండ్  ధర 

399cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఆధారితమైన ఈ బైక్ 6-గేర్ బాక్స్ సెటప్‌తో  వస్తుంది. మరో రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సేల్ కి రానున్న ఈ బైక్ ప్రారంభ ధర దాదాపు మూడు లక్షల రూపాయలు (భారతదేశంలో) ఉండవచ్చని అంచనా. 

Latest Videos

click me!