
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలో 'డిజిటల్ విప్లవం' వెనుక ముఖేష్ అంబానీ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. తమ వద్ద ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ సామాన్యులకు డిజిటిల్ విప్లవాన్ని పరిచయం చేసిన సంస్థ 'రిలయన్స్ జియో' పేరు మాత్రం అత్యంత విశిష్టమైనది. అంతేక పెట్రోకెమికల్ వ్యాపారంలో రిలయన్స్ కొత్త ఎత్తులను చూసింది. దాని ఉత్పత్తులు బంగారం లాంటి లాభాలను రిలయన్స్ సంస్థకు ఇవ్వడం ప్రారంభించాయని అంటారు. రిలయన్స్ పెట్రోకెమికల్ ఎప్పుడూ నష్టాన్ని ఎదుర్కోని కంపెనీలలో ఒకటి.
ముఖేష్ అంబానీ విద్యాభ్యాసం గురించి మాట్లాడుకుంటే, ఆయన ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. దీని తర్వాత, అతను అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో తన MBA పూర్తి చేశారు. ఆ తర్వాత, వ్యాపార అభివృద్ధికి తన పనిలో సహాయం చేయడానికి అతని తండ్రి ముఖేష్ అంబానీని ముంబైకి పిలిచారు. ముఖేష్ అంబానీ ముంబైకి తిరిగి వచ్చి తన తండ్రితో కలిసి రిలయన్స్ పెట్రోలియం కెమికల్స్ ప్రారంభించాడు. ఈ సంస్థ ప్రారంభం చాలా పెద్దది కాబట్టి, వారు ఎప్పుడూ నష్టాన్ని ఎదుర్కోలేదు.
నిజానికి ధీరూభాయ్ అంబానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. అందుకే చిన్నతనంలో ముకేష్ అంబానీ కుటుంబం ముంబైలోని భులేశ్వర్‌లో రెండు గదుల ఇంట్లో నివసించింది. తరువాత, ధీరూభాయ్ అంబానీ కొలాబాలో సీ-విండ్ అనే 14-అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు. ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో చాలా సంవత్సరాలు గడిపారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి దక్షిణ ముంబైలోని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 400,000 చదరపు అడుగుల భవనం 'యాంటిలియా'లో నివసిస్తున్నారు.
రిలయన్స్ వ్యాపారం విజయం వెనుక ముఖేష్ పాత్ర కనిపిస్తుంది. 80వ దశకంలో పాలిస్టర్ ఫిలమెంట్ నూలు ఉత్పాదనకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టాటా, బిర్లా సహా 43 కంపెనీలు దాని లైసెన్స్ కోసం వేలం వేయగా, రిలయన్స్ మాత్రమే విజయం సాధించింది. లైసెన్స్ పొందిన తర్వాత, అతని తండ్రి అమెరికా నుండి భారతదేశానికి రావాలని ముఖేష్ అంబానీకి కబురు పంపారు. ముఖేష్ అంబానీ కూడా భారతదేశానికి తిరిగి వచ్చి 1981లో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత రిలయన్స్ పెట్రోకెమికల్స్ ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ పాలిమర్లు, ఎలాస్టోమర్లు, పాలిస్టర్, ఆరోమాటిక్స్, ఫైబర్స్ కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ చాలా పేరు, విలువను సంపాదించింది.
2000 సంవత్సరంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ 70వ ఏట కన్నుమూశారు. ఇది భారతీయ వ్యాపార ప్రపంచానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు వారి తండ్రి ధీరూభాయ్ అంబానీ నుండి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందారు. తండ్రి మరణానంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి రిలయన్స్ వ్యాపారాన్ని విస్తృతం చేస్తారని అంతా భావించారు. కానీ ఇది జరగలేదు.
తండ్రి ధీరూభాయ్ అంబానీ చనిపోయి రెండేళ్లకే అన్నదమ్ముల మధ్య ఉన్న మనస్పర్ధలు బయటపడ్డాయి. ముఖేష్, అనిల్ అంబానీల మధ్య వైరం ఎంతగా పెరిగిందంటే తల్లి కోకిలాబెన్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యాపార విభజన జరిగింది. ఆయిల్ రిఫైనరీస్ , పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని ముఖేష్‌కు అప్పగించగా, అనిల్‌కి టెలికాం, ఫైనాన్స్. ఎనర్జీ యూనిట్లు వచ్చాయి. ఇది కాకుండా, సోదరులిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడకూడదని, కూడా ఒప్పందంపై సంతకం చేశారు. ముఖేష్ టెలికాం వ్యాపారంలో అడుగు పెట్టకూడదని, అనిల్ పెట్రోకెమికల్స్ వ్యాపారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
విభజనలో అనిల్ అంబానీకి టెలికాం వ్యాపారం దక్కింది, అయితే ఆ సమయంలో ముఖేష్ మౌనం వహించాడు. విభజన తర్వాత అనిల్ అంబానీకి మొదట్లో పరిస్థితులు అనుకూలించాయి. కానీ విధి వక్రించి అనిల్ వ్యాపారంలో క్షీణత ప్రారంభమైంది. ఆ తర్వాత 2008 ఆర్థిక మాంద్యం దెబ్బ అనిల్ అంబానీకి గట్టిగా తగిలింది. మరోవైపు ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూపు షేర్లు పుంజుకున్నాయి. ఆయన చేపట్టిన వ్యాపారాలు లాభాలను ఇవ్వడం ప్రారంభించాయి.
ముఖేష్ అంబానీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేశారు. ఇద్దరు సోదరుల మధ్య పోటీ ఉండకూడదు అనే నిబంధన 2010లో ముగిసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ముఖేష్ అంబానీ. వెంటనే టెలికాం రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏడేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. కొత్త కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కోసం హై స్పీడ్ 4G వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
ముఖేష్ అంబానీ వేసిన ఒక్క దెబ్బతో ప్రతి గ్రామంలోనూ అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే సమయంలో, ముఖేష్ అంబానీ పెట్రోకెమికల్ వ్యాపారం కూడా ప్రతిరోజూ కొత్త రికార్డులను సాధించింది. నేడు ముఖేష్ అంబానీ వ్యాపారం వెలిగిపోతోంది. అదే సమయంలో అనిల్ అంబానీ కంపెనీలు దివాళా తీశాయి. భారీ అప్పుల్లో ఉన్నాయి. మరో వైపు రిటైల్ రంగంలో ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. దీంతో పాటు మరెన్నో కొత్త రంగాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అటు అనిల్ అంబానీకి చెందిన కంపెనీలకు బ్యాంకుల అప్పులు భారీగా ఉన్నాయి.
జామ్‌నగర్ (గుజరాత్)లో గ్రౌండ్ లెవల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీని ఏర్పాటు చేయడంలో ముఖేష్ అంబానీ కీలకపాత్ర పోషించడం మరో పెద్ద రికార్డు. 2008లో రిలయన్స్ కంపెనీ తన క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్‌ని 111.9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటి.