Expensive Flat: ఈ ఫ్లాట్ ధర అక్షరాల 700 కోట్ల రూపాయలు, అందులో ఫెసిలిటీలు ఇవే

Published : Oct 11, 2025, 10:26 AM IST

700 కోట్ల రూపాయలకు వందెకరాల భూమిని కొనవచ్చు. కానీ ముంబైలో మాత్రం ఒకే ఒక్క అపార్ట్మెంట్ ధర 700 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఫ్లాట్లో (Expensive flat) ఎలాంటి సదుపాయాలు ఉంటాయో, ఎందుకంత ఖరీదో తెలుసుకుందాం. 

PREV
15
ముంబైలో ఖరీదైన ఫ్లాట్

హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలలో కూడా 50 లక్షల రూపాయలకి మంచి ఫ్లాట్ వచ్చేస్తుంది. కానీ ముంబైలోని ఒక అపార్ట్మెంట్ ధర మాత్రం ఏకంగా 700 కోట్ల రూపాయలు. అంత డబ్బు ఉంటే హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఎన్నో ఇళ్ళను, భూములను సొంతం చేసుకోవచ్చు. అలాంటిది ఒకే ఒక్క ఫ్లాట్ ధర అంత పెద్ద మొత్తానికి ఎలా అమ్ముడుపోయింది.. దాన్ని స్పెషాలిటీ ఏంటి?

25
సెలెబ్రిటీలు ఉండే ప్రాంతం

ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటారు. ప్రపంచంలో ముంబైకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వందల కొద్ది బిలియన్లకు ముంబైలోనే నివసిస్తున్నారు. అంబానీలు, అదానీ కుటుంబాలు కూడా ముంబైలోనే నివసిస్తున్నారు. ఇక ముంబైలోని వర్లీ ప్రాంతం చాలా ఫేమస్. ఇది సెలబ్రిటీలు ఉండే ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ధనవంతుల నగరంగా ముంబైకి ఇప్పటికే ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ నగరంలో మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ అమ్ముడుపోయింది. దాని ధర 700 కోట్ల రూపాయలు.

35
నాలుగు అంతస్తుల్లో ఒకే ఫ్లాట్

ముంబైలోని వర్లీ ప్రాంతంలో సముద్ర ముఖంగా నమన్ జానా టవర్ నిర్మించారు. ఇందులో డబుల్ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే అందులో నాలుగంతస్తుల్లో ఫ్లాట్ నిర్మించారు. అందులో ఒక అపార్ట్మెంట్ ను అమ్మకానికి పెట్టారు. దాని ఖరీదు 700 కోట్ల రూపాయలు. దీన్ని యుఎస్పీ ఫార్మాసుటికల్స్ చైర్మన్ లీనా గాంధీ తివారి 639 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ అన్నిటితో కలిపి 703 కోట్ల రూపాయలు అయింది.

45
ఎంత పెద్దది?

ఈ అపార్ట్మెంట్ 32వ అంతస్తుతో మొదలై 35వ అంతస్థు వరకు విస్తరించి ఉంటుంది. అంటే డబుల్ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ మొత్తం ఈ ఫ్లాట్ 22,572 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక్కొక్క చదరపు అడుగులకు 2.83 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ముంబైలోనే అతి లగ్జరీ అపార్ట్మెంట్ గా ఇది పేరు సంపాదించింది.

55
ఎకరం కన్నా తక్కువ స్థలంలోనే

ఈ నమన్ జానా టవర్ ను కేవలం 0.64 ఎకరాల స్థలంలోనే నిర్మించారు. 150 మీటర్ల ఎత్తుతో ఉండే ఈ అపార్ట్మెంట్లో 11 అంతస్తులు కేవలం పార్కింగ్ లెవెల్సే ఉన్నాయి. ఇందులో ఎకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్ ఉంది. ప్రతి ఇంటికి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఫీచర్లు ఉన్నాయి. ఇంట్లోనే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు వాయిస్ కమాండ్స్ తోనే పని చేస్తుంది. అపార్ట్మెంట్ ధర వార్తల్లోకి వచ్చాక వైరల్ గా మారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories