మీ ఖర్చులను కంట్రోల్‌ చేసే బెస్ట్‌ 5 యాప్స్‌ ఇవిగో

First Published | Sep 4, 2024, 5:08 PM IST

మీ నెలవారీ బడ్జెట్‌ అదుపు తప్పతోందా? డబ్బులు అసలు ఆదా చేయలేకపోతున్నారా? ఎంత ఆలోచించి ఖర్చుపెట్టినా అవసరాలు తీరడం లేదా? అయితే ఈ 5 యాప్‌లు మీకు ఎంతో సహాయం చేస్తాయి. ఇవి మీ ఖర్చులను వర్గీకరిస్తాయి. నెలవారీ బడ్జెట్‌ను తయారు చేస్తాయి. మీరు ఎక్కడైనా అనసవరంగా ఖర్చు పెడుతున్నా వెంటనే హెచ్చరిస్తాయి. అలాంటి చక్కటి 5 యాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

* వాల్‌నట్ యాప్
ఈ యాప్ సహాయంతో మీరు మొత్తం నెలకు సంబంధించిన మీ ఖర్చులను ఎప్పటికప్పుడు గమనించవచ్చు. 40 కంటే ఎక్కువ బ్యాంకులు ఈ యాప్‌కు మద్దతు ఇస్తాయి. అంటే ఆయా బ్యాంకులకు చెందిన ట్రాన్సాక్షన్స్‌ అన్నీ ఈ యాప్‌ ద్వారా చూసుకోవచ్చు. ఈ యాప్ మీ ఎస్‌ఎంఎస్‌లను చదివి మీ ఖర్చులను గమనిస్తుంది.

* వాల్‌నట్ యాప్ ప్రయోజనాలు
వాల్‌నట్ యాప్ బిల్లులను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది మీ సమీపంలో ఉన్న ఏటీఎంలను గుర్తించి మీకు చెబుతుంది. ఏటీఎంలో డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఫ్రాడ్‌ ట్రాన్‌సాక్షన్‌ జరగకుండా మీ వివరాలు కన్ఫర్మ్‌ చేసేలా మెసేజ్‌ పంపి వివరాలు తీసుకుంటుంది. 

* వాల్‌నట్ హెల్త్ క్లబ్ అనేది ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన సామాజిక నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.  ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. చర్చలు చేయవచ్చు. ఇలాంటి అనేక విషయాల సమాహారంగా  ఈ యాప్‌ పనిచేస్తుంది. ఈ యాప్‌ వినియోగదారులు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి ప్రైవేట్ లైవ్ ఫీడ్‌ని కూడా అందిస్తుంది. వాల్‌నట్ యాప్ లో చదువుకు చెందిన ఇంటరాక్టివ్ లైవ్ క్లాసులు కూడా ఉంటాయి.

 * మింట్ యాప్
ఈ యాప్ మీ బ్యాంకు ఖాతాలను కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చేస్తున్న ఖర్చులను గమనిస్తూ వివరాలను ఎప్పటికప్పుడు మీకు మెసేజ్‌ రూపంలో తెలియజేస్తుంది. ఇది మీ ఖర్చు చేసే అలవాట్లను కూడా విశ్లేషిస్తుంది.  వాటిని గమనించి మీరు డబ్బు ఎలా ఆదా చేయాలో సూచనలు కూడా ఇస్తుంది. మింట్ అనేది మీ డబ్బును నిర్వహించడంలో సహాయపడే ఫైనాన్సియల్‌ పర్సనల్‌ యాప్‌. ఈ యాప్ మీ బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, పెట్టుబడులను ఒకే చోట కనెక్ట్ చేసి ఆర్థిక పరమైన సమాచారాన్నంతా మీకు అందిస్తుంది.

* మింట్ యాప్ ప్రధాన లక్షణాలు
ఈ యాప్ మీ ఖర్చులను దేనికి దానికి సెపరేట్‌ చేస్తుంది. అందువల్ల మీరు ఎక్కడ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో వివరంగా చెబుతుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెలా డ్రెస్‌లు ఎక్కువగా కొంటున్నారు అనుకోండి వెంటనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. దీన్ని బట్టి మీ ఆదాయం, ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు బిల్లులు కూడా చెల్లించవచ్చు. మీరు సమయానికి బిల్లులు కట్టడం మరిచిపోయానా మీకు గుర్తుచేస్తుంది. ఈ యాప్ మీ క్రెడిట్ స్కోరును కూడా చూపిస్తుంది. దీని ద్వారా లోన్‌ సదుపాయాలు, ఏ బ్యాంకు లోన్‌ ఇస్తుందో అలాంటి వివరాలు కూడా మీరు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 


* మనీ మేనేజర్ ఎక్స్పెన్స్ & బడ్జెట్ యాప్
ఈ యాప్ మీ ఖర్చులు, ఆదా మొత్తాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దీని సహాయంతో మీరు మీ ఆదాయం  మొత్తాన్ని అంచనా వేయవచ్చు. మనీ మేనేజర్‌ మీ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ను గుర్తు చేస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తే మీ డబ్బు భద్రంగా ఉంటుందో అలాంటి వివరాలు కూడా తెలియజేస్తుంది. 

* ఈ యాప్ లక్షణాలు
మీ ఖర్చులను గమనిస్తూ మీరు ఆర్థిక ప్రగతికి సూచనలిస్తుంది. ఖర్చు నివేదికలను తయారు చేస్తుంది. వీటిని గమనించడం ద్వారా మీ ఖర్చులు కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా రోజు వారీ ఆదాయ వ్యయాలు,  వారం రోజుల్లో మీరు చేసిన ఖర్చులు, నెలవారీ ఆర్థిక సమాచారాన్ని కూడా విడివిడిగా ఇస్తుంది. అంతేకాకుండా మీ ఆస్తులను కూడా ఈ యాప్‌ పర్యవేక్షిస్తుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయవ్యయాలపై మీకు సూచనలు కూడా ఇస్తుంది. జీతం, ఖర్చులను పైచార్ట్ రూపంలో మీకు చూపించి విశ్లేషిస్తుంది. ఏదైనా బిల్లులు కట్టాల్సి వచ్చినప్పటికీ ఈ యాప్‌లో రిమైండ్‌ పెట్టకుంటే మీకు టైమ్‌ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు చేస్తుంది. 

* క్లారిటీ మనీ యాప్
ఈ యాప్ మీకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. క్లారిటీ మనీ యాప్ మెషీన్ లెర్నింగ్ సాయంతో పనిచేస్తుంది. ఇది వినియోగదారులకు వారి పర్సనల్‌, ఫైనాన్సియల్‌ లావాదేవీలు నిర్వహించడంలో సహాయపడింది. ఈ యాప్ ప్రజలకు వారి బ్యాంకింగ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సమాచారం ఇస్తుంది.

* డిజిట్ సేవ్ మనీ ఆటోమేటిక్ యాప్
ఈ యాప్ మీ అకౌంట్‌ నుండి ఆటోమేటిక్‌గా ఒక మొత్తం డబ్బును తీసి దాన్ని ఆదా చేస్తుంది. ఇలా ప్రతి నెలా కొంత సేవ్‌ చేసే విధంగా మీరు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది మీ రోజువారీ ఆదాయ, వ్యయాలు ఖర్చులను పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి 1 శాతం సేవింగ్స్‌ బోనస్‌ను ఇస్తుంది. మీ ఆదాయ వ్యయాలను బట్టి రోజువారీ ఖర్చలను నిర్ణయిస్తుంది. ఈ యాప్‌ ద్వారా మీ ఫండ్స్‌ అన్నీ చాలా సెక్యూర్‌గా ఉంటాయి.  

Latest Videos

click me!