Aadhaar New Update: మోసాలను అరికట్టేందుకు ఆధార్‌లో కొత్త మార్పు! ఇక వేలిముద్రలు అక్కర్లేదు

Published : Feb 21, 2025, 05:07 PM IST

Aadhaar Card New Update: ఆధార్ కార్డులో మోసాల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆధార్ అథెంటికేషన్ కి వేలిముద్రలు వేసే వాళ్లం కదా.. ఇకపై అవి అవసరం లేదు. మరి కొత్త విధానం గురించి తెలుసుకుందాం రండి.   

PREV
14
Aadhaar New Update: మోసాలను అరికట్టేందుకు ఆధార్‌లో కొత్త మార్పు! ఇక వేలిముద్రలు అక్కర్లేదు

మనకున్న గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది కదా.. ఎందుకంటే పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డు ఇవ్వాలి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు, ప్రైవేట్ పనులకు కూడా ఆధార్ కార్డు ఉపయోగిస్తాం. ఇలా ఆధారాల కోసం ఇచ్చిన ఆధార్ కార్డు డీటైల్స్ ను కొందరు దుండగులు మోసాలకు ఉపయోగిస్తున్నారని అధికారలకు కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే మోసాలను అరికట్టడానికి ఆధార్ రూల్స్‌లో మార్పులు చేయనుందని సమాచారం. 

24

ఇండియాలో 130 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదే జరిగితే ఆధార్ కార్డు వాడకం ఇంకా సులువు కానుంది. ఇక కస్టమర్లు గంటల తరబడి క్యూలో నిలబడి వేలిముద్రలు, OTP ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కెమెరా ముందు నిలబడితే సరిపోతుంది. 

34

వేలిముద్రలకు బదులు, కస్టమర్ల ముఖాన్ని డైరెక్ట్‌గా స్కాన్ చేయడం ద్వారా అన్ని రకాల పనులూ అయ్యేలా అప్డేషన్ చేయనుందని సమాచారం.  దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీలు వస్తాయని వార్తలు వస్తున్నాయి. ఈ అప్డేషన్ జరిగితే బ్యాంక్, ఈ-కామర్స్, ప్రయాణాల సమయంలో ఎక్కువ టైమ్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 

44

వేలి ముద్రలను దొంగిలించి దొంగ ఆధార్ కార్డులు తయారు చేసి మోసాలు చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అందుకే ఎక్కడైనా అథెంటికేషన్ కోసం వేలి ముద్రలు వేయమన్నా జనం భయపడే పరిస్థితి ఉంది. అందుకే ఫేస్ అథెంటికేషన్ వల్ల మోసాలకు అడ్డుకట్ట పడతాయని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ అప్డేషన్ ఎప్పుడు మొదలవుతుందనే దాని గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

click me!

Recommended Stories