గుడ్ న్యూస్ : బంగారం ధరలకు బ్రేక్.. నేడు 10గ్రా,. పసిడి ధర ఎంత తగ్గిందంటే..?

First Published Aug 2, 2021, 11:44 AM IST

అంతర్జాతీయ సూచనల కారణంగా సోమవారం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి.  ఈ రోజు ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.10 శాతం అంటే రూ .47 తగ్గి 10 గ్రాములకు రూ. 47954 కి చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా 0.03 శాతం (రూ .23) పెరిగి కిలో రూ. 67870 వద్ద ఉంది. పసిడి గత సంవత్సరం గరిష్ట స్థాయి (రూ. 56,200 10 గ్రాముల) నుండి రూ .8246 తగ్గింది. 
 

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ .48,430కి విక్రయిస్తున్నారు, వెండి స్పాట్ మార్కెట్‌లో గురువారం కిలోకు రూ. 68,053గా ఉంది. సుదీర్ఘమైన అస్థిరత తరువాత భౌతిక బంగారం, వెండి ధరలు జులైలో మిశ్రమంగా ఉన్నాయి. గత ఒక నెలలో పసిడి 10 గ్రాములకు రూ .850 పెరిగింది, వెండి కిలో రూ. 900 తగ్గింది. భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ గత వారం బలహీనంగా ఉంది. ధరల పెరుగుదల కారణంగా రిటైల్ కొనుగోళ్లు దెబ్బతిన్నాయి.

పెరుగుతున్న కరోనావైరస్ కేసులు,  ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహాల ధరను ప్రభావితం చేస్తాయి. అధిక ముడి పదార్థాల ధరలు, ప్రతికూల వాతావరణం మధ్య జూలైలో చైనా ఫ్యాక్టరీ కార్యకలాపాలు నెమ్మదిగా 17 నెలల్లో వృద్ధి చెందాయి, ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మందగించే ఆందోళన కలిగిస్తోంది. 
 

గ్లోబల్ మార్కెట్‌లో

ఈ రోజు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర 0.2 శాతం తగ్గి ఔన్స్ కి 1,809.21 డాలర్లకు చేరుకుంది. యు.ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.1 శాతం తగ్గి 1,814.90 డాలర్లకు పడిపోయింది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.4 శాతం తగ్గి  ఔన్సు కి  25.37 డాలర్ల వద్ద ఉంది. పల్లాడియం 0.1 శాతం పెరిగి  2,664.34 డాలర్ల వద్ద, ప్లాటినం 0.06 శాతం పెరిగి 1,054.72 డాలర్ల వద్ద ఉన్నాయి. 
 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,140 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,430గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,380 వద్ద కొనసాగుతోంది.

 బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 44,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 48,000 వద్ద ఉంది.

 చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,470 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,610 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,990 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.

click me!