బంగారం కొనాలా? వెండి కొనాలా? ఏది కొంటే లాభం?

Published : Aug 22, 2025, 04:21 PM IST

బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులైతే బంగారం పేరు వింటేనే భయపడే పరిస్థితి. అంత మొత్తం పెట్టి బంగారం కొనలేక కొందరు వెండి వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే బంగారం, వెండిలో ఏది కొంటే మంచిది? దేని ధర వేగంగా పెరుగుతోందో ఇక్కడ చూద్దాం.

PREV
16
బంగారం, వెండిలో దేనిపై పెట్టుబడి పెట్టవచ్చు?

బంగారానికి మనకు విడదీయలేని బంధం ఉందనడంలో ఎలాంటి సందేహాం లేదు. కానీ ఈ మధ్య బంగారం ధరలు బాగా పెరిగాయి. ఎంత పెరిగాయంటే.. సామాన్యులు చిన్న వస్తువు కొనడానికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడాదంతా కూడబెట్టినా తులం బంగారం కొనలేని పరిస్థితి. నిజానికి చాలామంది బంగారాన్ని ఆభరణాలకే కాదు.. పెట్టుబడి రూపంలో కూడా కొనుగోలు చేస్తుంటారు. అంత పెట్టుబడి పెట్టి బంగారం కొనుగోలు చేయడం మంచిదా, లేక తక్కువ పెట్టుబడితో వెండి కొనుగోలు చేయడం మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారు? దేని ధర వేగంగా పెరుగుతోంది? దేనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశముందో ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU KNOW ?
2025లో వెండి ధరలు 22% పెరిగాయి. బంగారం 27% హైక్ నమోదు చేసింది. గత 5 సంవత్సరాల్లో వెండి (100%) ఎక్కువ రాబడిని ఇచ్చింది. కానీ దీర్ఘకాలంలో బంగారం (12% CAGR) మెరుగ్గా పెరిగింది.
26
బంగారంపై పెట్టుబడి..

బంగారం అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. పేదవారి సంగతి పక్కన పెడితే.. అవకాశం ఉన్నవారు ఎప్పుడూ బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అలంకరణ కోసం మాత్రమే కాకుండా చాలామంది బంగారంపై పెట్టుబడి కూడా పెడుతుంటారు. అయితే గత ఐదేళ్లలో బంగారం ధర ఎంత పెరిగిందో.. ఇక్కడ చూద్దాం. 

36
గత ఐదేళ్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తులం బంగారం ధర సగటున.. 2020 సంవత్సరంలో రూ. 50,151… 2021లో 48,099 రూపాయలు, 2022 సంవత్సరంలో 55,017 రూపాయలుగా ఉంది. 2023 సంవత్సరంలో రూ. 63,203.. 2024 సంవత్సరంలో రూ. 78,245, 2025(ఆగస్టు22) 1,00,530 రూపాయలు. అంటే ఈ ఐదేళ్లలో బంగారం ధర దాదాపు 85 శాతానికి పైగా రాబడినిచ్చింది. 

46
వెండిపై పెట్టుబడి

బంగారంతో పోలిస్తే వెండి చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే చాలామంది ఇప్పుడు వెండి వైపు ఆసక్తి చూపుతున్నారు. గతంలో వెండిని చాలా తక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. బంగారంపై పెట్టుబడి పెట్టే బదులు వెండిపై పెడితే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆలోచిస్తున్నారు. నిజానికి వెండి.. విలువైన లోహం మాత్రమే కాదు.. విద్యుత్ పరికరాలు, సోలార్ ప్యానెల్లు, ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా వెండిని ఉప‌యోగిస్తున్నారు. దానివల్ల వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 

56
గత ఐదేళ్లలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

కొన్ని రిపోర్టుల ప్రకారం 2020లో కేజీ వెండి ధర సుమారు రూ.63,435 ఉంది. 2021 సంవత్సరంలో 62,572 రూపాయలు, 2022లో 55,100 రూపాయలు, 2023 లో 78,600 రూపాయలు, 2024 సంవత్సరంలో రూ. 95,700, 2025 (ఆగస్టు 22)లో 1,28,000 రూపాయలుగా ఉంది. అంటే ఈ ఐదేళ్లలో వెండి.. బంగారం కంటే మెరుగైన రాబడినిచ్చింది.

66
బంగారం, వెండి..రెండింటిలో ఏది కొనడం బెస్ట్?

బంగారం, వెండి రెండూ దీర్ఘకాలిక పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో భాగం కావచ్చు. వీటిలో ఏది మంచి రాబడి ఇస్తుందనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పొదుపు, భద్రత కోసం పెట్టుబడి పెట్టేవారికి బంగారం సురక్షిత మార్గం. రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల్లో బంగారం ధర పెరుగుతుంది. కానీ గణనీయమైన లాభాలు రావడానికి సమయం తీసుకుంటుంది. పరిశ్రమల్లో పెరుగుతున్న వినియోగం కారణంగా వెండికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. పెట్టుబడి వృద్ధికి, అధిక లాభాల కోసం వెండి మంచి ఎంపిక. నిపుణుల ప్రకారం రానున్న రోజుల్లో కిలో వెండి ధ‌ర రూ. 2 ల‌క్ష‌లు దాటుందని అంచనా. 

Read more Photos on
click me!

Recommended Stories