దిగొస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్ లో రూ. 1100 తగ్గిన కిలో వెండి ధర..

First Published Jun 17, 2021, 1:54 PM IST

 బంగారం,  వెండి ధరలు దిగోస్తున్నాయి. భారత మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, నేడు జూన్ 17న 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47611 చేరింది, దీని ధర నిన్న అంటే బుధవారం సాయంత్రం 10 గ్రాములకు రూ .48397 వద్ద ఉంది. 

అలాగే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 999 స్వచ్ఛతగల వెండి ధర కిలోకు రూ.70079గా ఉంది. స్వచ్ఛత గురువారం ఉదయం ధరబంగారం (10 గ్రాములకు) 999 రూ.47,611 బంగారం (10 గ్రాములకు) 995 రూ.47,420 బంగారం (10 గ్రాములకు) 916 రూ.43,612 బంగారం (10 గ్రాములకు) 750 రూ.35,708 బంగారం (10 గ్రాములకు) 585 రూ.27,852 వెండి (1 కిలోకు) 999 రూ.70,079
undefined
అంతర్జాతీయ మార్కెట్లో 2023లో వడ్డీ రేటు పెంపు జరగవచ్చని యు.ఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. దీంతో బుధవారం పుత్తడి ధర 1 శాతం తగ్గింది. తాజాగా 2.31 శాతం ధర పడిపోవడంతో పసిడి ఔన్స్‌ ధర 1,821 డాలర్లు చేరింది. గురువారం రోజు హైదరాబాద్‌ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. నేడు జూన్ 17న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 క్షిణించి రూ.49,470కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 క్షిణించి రూ. 45,350కు తగ్గింది. జూన్ 11 తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ 50 వేలుపైనే పలికిన సంగతి మీకు తెలిసిందే. వెండి ధర కిలోకు 1.10 శాతం అంటే 1100 రూపాయలు తగ్గి కిలో రూ.75100 గా ఉంది.
undefined
మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలు తెలుసువచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శనివారం, ఆదివారం పసిడి ధరలు జారీ చేయబడవు. బంగారం 22 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణాల రిటైల్ ధ్హరను తెలుసుకోవడానికి మీరు 8955664433 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. దీంతో ఎస్ఎంఎస్ ద్వారా ధరలు అందుతాయి. అంతేకాకుండా వీటి ధరల అప్ డేట్ గురించి సమాచారం కోసం మీరు www.ibja.com వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.
undefined
బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి,24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది, కాని 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు. సాధారణంగా ఆభరణాలను తయారు చేయడానికి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు, ఇందులో 91.66 శాతం స్వచ్చమైన బంగారం ఉంటుంది.
undefined
ఆభరణాలలో స్వచ్ఛతకు సంబంధించిన 5 రకాల హాల్‌మార్క్‌లు గుర్తుంచుకోవాలి. వీటిలో ఒకటి క్యారెట్ గురించి 22 క్యారెట్ల ఆభరణాలు అంటే 916, 21 క్యారెట్ ఆభరణాలపై 875, 18 క్యారెట్ ఆభరణాలపై 750 ఉంటుంది. మరోవైపు ఆభరణాలు 14 క్యారెట్లతో ఉంటే 585 ఉంటుంది. మీరు ఈ గుర్తును ఆభరణాలపై చూడవచ్చు. ఇది ఖచ్చితత్వానికి ఎటువంటి సందేహం లేదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ త్రిభుజాకార గుర్తును కలిగి ఉంటుంది. ఇది బంగారు క్యారెట్ స్వచ్ఛత గుర్తు పక్కన కనిపిస్తుంది.
undefined
click me!