బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. నేడు స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఏంతంటే..?

First Published Sep 8, 2021, 11:33 AM IST

నిన్న  కాస్త దిగోచ్చిన పసిడి బుధవారం దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్  ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి 10 గ్రాములకు రూ. 46980 కి చేరుకుంది. వెండి కూడా స్వల్పంగా తగ్గి కిలోకు రూ. 64580 వద్ద స్థిరపడింది. 

మంగళవారం  ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధర ఒక శాతం వరకు తగ్గాయి. గత సంవత్సరం గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56200 నుండి పసిడి ఇప్పటికీ రూ .9220 తగ్గింది.  
 
ప్రపంచ మార్కెట్లలో ఔన్సు బంగారం కీలకమైన స్థాయి  1,800 డాలర్ల కంటే దిగువన ట్రేడవుతోంది. యుఎస్ డాలర్ ఇండెక్స్ ఒక వారం గరిష్ట స్థాయి 92.543కి చేరుకుంది. నిన్న 1,791.90 కి పడిపోయిన తర్వాత స్పాట్ గోల్డ్ ఈరోజు ఔన్స్ కి  1,796.03 డాలర్ల వద్ద ఫ్లాట్ అయింది. ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్స్ కి 0.1 శాతం పెరిగి 24.32 డాలర్లు, ప్లాటినం 0.3 శాతం పెరిగి 1,001.36 డాలర్లుగా ఉన్నాయి.  

ఈ వారం జరిగే ఈ‌సి‌బి సమావేశం ఫలితాలపై వ్యాపారులు దృష్టి పెట్టారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ వారంలో ద్రవ్య విధాన సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ త్వరలో బాండ్ టేపింగ్ ప్రారంభిస్తుందనే చర్చ పెరుగుతోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారు.

గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి

ఎస్‌పి‌డి‌ఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఈ‌టి‌ఎఫ్, గత వారం 998.52 టన్నులకు పెరిగింది. గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి. బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని ఇటిఎఫ్ ప్రవాహాలు ప్రతిబింబిస్తాయని గమనించాలి.  

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.

హైదరాబాద్‌లో వెండి ధర కూడా పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.200 దిగొచ్చి రూ.69,600కు చేరింది.

click me!