భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఆరు నెలల కనిష్టానికి గోల్డ్ ఫ్యూచర్స్..

First Published Sep 20, 2021, 1:18 PM IST

ఈ రోజు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్స్ పడిపోయాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజి (ఎం‌సి‌ఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు బలహీనమైన గ్లోబల్ సూచనల కారణంగా 10 గ్రాములకు 0.13 శాతం తగ్గి రూ. 45928 కి చేరుకుంది. దీంతో  పసుపు లోహం  ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

కిలో వెండి ధర 1.00 శాతం తగ్గి రూ .59427 కి చేరుకుంది. గత సంవత్సరం గరిష్ట స్థాయి నుండి 10 గ్రాములకు రూ. 56200 నుండి బంగారం ధర  ఇప్పటికీ రూ. 10272 తగ్గింది. గత సెషన్‌లో బంగారం ధర 0.16 శాతం, వెండి ధర 1.76 శాతం తగ్గాయి. ఆగస్టులో బంగారం దిగుమతులు అధికంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. రానున్న పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలు ఉంటాయని దేశీయ డీలర్లు భావిస్తున్నారు.

బంగారం  ధర గతంతో పోల్చితే దారుణంగా పతనం అవుతోంది. గతేడాది బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపించాయి. కానీ ఇప్పుడు బంగారం ధర రోజురోజుకీ పడిపోతోంది. గతేడాది రికార్డు ధరతో పోలిస్తే ఇప్పుడు బంగారం సుమారు రూ.11,000 తక్కువకే లభిస్తోంది. స్వచ్ఛమైన బంగారంతో పాటు, ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర కూడా అదే స్థాయిలో పడిపోతోంది. 

గత  ఏడాది క్రితం 2020 ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 కి చేరుకొని రికార్డు సృష్టించింది, తర్వాత భారీగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,300. ప్రస్తుతం రికార్డు ధర నుంచి 22 క్యారట్ల పసిడి ధర రూ.10,900 తక్కువకే గోల్డ్ లభిస్తోంది.  ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

 యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ప్రభావితమయ్యాయి. స్పాట్ బంగారం ఔన్స్ 0.1 శాతం తగ్గి 1,752.66 డాలర్లకు పడిపోయింది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ కి 22.33 డాలర్లు, ప్లాటినం 0.1 శాతం తగ్గి 940.39 డాలర్ల వద్ద ఉన్నాయి.

గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి. పసుపు లోహం ధరలో హెచ్చుతగ్గులపై దాని ధర కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని ఇటిఎఫ్ ప్రవాహాలు ప్రతిబింబిస్తాయని గమనించాలి. బలమైన కరెన్సీ ఇతర కరెన్సీల హోల్డర్లకు బంగారాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తుంది.
 

వెండి ధర కూడా భారీగా తగ్గింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి ధర రూ.76,150 కి చేరుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,500గా ఉంది. అంటే రికార్డు ధర నుంచి రూ.12,650 తగ్గింది.  

ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్-జూలైలో   12.5 బిలియన్ల డాలర్లకు పెరిగాయి

ఏప్రిల్-జూలై 2021లో దేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 6.04 శాతం పెరిగి 12.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది 2019-20 కాలంలో ఎగుమతులు 11.8 బిలియన్ల డాలర్లుగా ఉన్నాయి. యుఎస్, చైనా, హాంకాంగ్ వంటి ప్రధాన ఎగుమతి గమ్యస్థాన మార్కెట్లలో కొనసాగుతున్న పునరుద్ధరణ ఎగుమతులను పెంచింది. జూలైలో దేశ ఎగుమతులు 18 శాతం పెరిగి 3.36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని జిజెఇపిసి నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో  3.87 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారు ఆభరణాల ఎగుమతులు 38.5 శాతం తగ్గి 2.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి ఆభరణాల ఎగుమతులు  843 మిలియన్ల డాలర్లకు పెరిగాయి.
 

click me!