వచ్చే ఏడాది నుండి చెప్పులు, బట్టలు మరింత ఖరీదైనవి కావచ్చు: జి‌ఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం

First Published | Sep 18, 2021, 6:51 PM IST

బట్టలు, బూట్లు కొనుగోలు చేసే వారు వచ్చే సంవత్సరం నుండి అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. దుస్తులు, పాదరక్షల పరిశ్రమ ఇన్వెర్టెడ్ డ్యూటీ స్ట్రాక్చర్  లో మార్పులు చేయాలనే దీర్ఘకాల డిమాండ్‌ను జి‌ఎస్‌టి కౌన్సిల్ ఆమోదించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో 1 జనవరి  2021 నుండి కొత్త ఫీజు స్ట్రాక్చర్  అమలు చేయాలని కౌన్సిల్ తెలిపింది.
 

పాదరక్షలు, దుస్తులపై జిఎస్‌టి కొత్త ధరలు అమలు చేయడానికి అంగీకరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ఇన్వెర్టెడ్ డ్యూటీ స్ట్రాక్చర్ జనవరి నుండి అమలులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ధరలు సవరించబడతాయి. వస్త్ర, షూ పరిశ్రమలోని వ్యాపారులు చాలాకాలంగా మార్పును డిమాండ్ చేస్తున్నారు. బూట్ల తయారీకి ముడి పదార్థాలపై 12 శాతం జిఎస్‌టి ఉందని, ఫినిష్డ్ ఉత్పత్తులపై జిఎస్‌టి రేటు 5 శాతం అని  అన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ముడిసరుకుపై చెల్లించిన సుంకం తిరిగి చెల్లించాలి. కౌన్సిల్ కొత్త రేట్లను వెల్లడించనప్పటికీ, పాదరక్షలపై 12 శాతం జి‌ఎస్‌టి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం, 5 శాతం జి‌ఎస్‌టి వసూలు చేయబడుతోంది, అయితే ఖరీదైన బూట్లు 18 శాతం జి‌ఎస్‌టిని ఆకర్షిస్తాయి. అదేవిధంగా, బట్టలపై జి‌ఎస్‌టి రేట్లను కూడా పెంచవచ్చు.

జిఎస్‌టి రేట్ల తగ్గింపుపై జిఓఎం సలహా

 జిఎస్‌టి ఫ్రేమ్‌వర్క్‌లో ప్రస్తుతం ఉన్న 5 రేట్లను మూడుకి తగ్గించే మార్గాలను సూచించడానికి మంత్రుల బృందం ఏర్పడిందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ బృందం రెండు నెలల్లో తన నివేదికను కౌన్సిల్‌కు సమర్పిస్తుంది, దీనిలో రేట్ల సంఖ్యను తగ్గించడానికి స్పష్టమైన సూచనలు ఇవ్వబడతాయి. అంతేకాకుండా ఇ-వే బిల్లు అండ్ ఫాస్ట్ ట్యాగ్‌లోని టెక్నాలజి లోపాలను తొలగించే మార్గాలను సూచించడానికి మంత్రుల బృందం కూడా ఏర్పాటు చేయబడింది.


ఈ సంవత్సరం చివరి వరకు జి‌ఎస్‌టి ఇన్‌పుట్ క్రెడిట్

ఎగుమతుల కోసం జి‌ఎస్‌టి ఇన్‌పుట్ క్రెడిట్ ఈ సంవత్సరం చివరి వరకు కొనసాగుతుంది. రాష్ట్రాలకు విధించే సెస్ కాలాన్ని కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు పెంచారు. రాష్ట్రాలకు పరిహారం ఇవ్వడానికి కేంద్రం రుణం తీసుకుంది. మార్చి 2026 నాటికి లగ్జరీ అండ్ హానికరమైన ఉత్పత్తులపై సెస్ ద్వారా దీనిని భర్తీ చేయబడుతుంది.

తమిళనాడు ఆర్ధిక  మంత్రి

తమిళనాడు ఆర్ధిక మంత్రి  పిటి ప్లానివెల్ తిగరాజన్ పెట్రోల్, డీజిల్‌  జీఎస్టీ పరిధిలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుంది. జి‌ఎస్‌టి అమలు చేయబడినప్పటి నుండి కాన్సిటీటూషన్  అందించిన రెవెన్యూకి సంబంధించి  రాష్ట్రాలు  చాలా చిన్న హక్కులు   తొలగిపోయాయి అలాగే మిగిలిన కొన్ని హక్కులను కూడా వదులుకోలేము అని అన్నారు.

జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చే అంశంపై కూడా 2022 తర్వాత రాష్ట్రాలకు పరిహారం ఇవ్వకూడదని సమావేశంలో చర్చించారు. 2017 జూలై 1న అమల్లోకి వచ్చిన జిఎస్‌టి చట్టంలో జిఎస్‌టి అమలు తర్వాత, రాష్ట్రాల జిఎస్‌టి వృద్ధి 14 శాతం కంటే తక్కువగా ఉంటే, అప్పుడు ఆటోమొబైల్స్, పొగాకు వంటి అనేక ఉత్పత్తులకు వచ్చే ఐదేళ్లపాటు ఈ నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ ఐదేళ్ల కాలం 2022లో ముగుస్తుంది. మార్చి 2026 వరకు సెస్ రికవరీ చేయడం వల్ల, కోవిడ్ కాలంలో రాష్ట్రాలు తీసుకున్న వడ్డీ, రుణం మాత్రమే ఖర్చు చేయబడుతుందని అన్నారు.

Latest Videos

click me!