పసిడి ప్రియులకు, మహిళలకు మంచి ఛాన్స్.. కొనేందుకు కలిసొస్తున్న ధరలు.. ఇవాళ తులం ధర ఎంత అంటే..?

First Published | Oct 5, 2023, 10:25 AM IST

గత 24 గంటల్లో బంగారం ధరలు చాల వరకు నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. నేడు అక్టోబర్ 5 2023 నాటికి ఇండియాలో  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ. 56,650, అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 51,890.
 

  ప్రముఖ నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 57,530 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 52,750. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 57,370 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 52,590.
 

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.57,370 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)  ధర రూ.52,590గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.56,600 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.53,900గా ఉంది.
 


పైన పేర్కొన్న బంగారు రేట్లు కేవలం సూచిక మాత్రమే. వీటిలో GST, TCS  ఇతర లెవీలు వంటి పన్నులు ఉండవు. ఖచ్చితమైన ధరల  కోసం  తప్పనిసరిగా స్థానిక జ్యువెలరీ షాప్స్ సంప్రదించాలి.
 

విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,370. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 73,100.  అయితే డిమాండ్‌ని బట్టి పెంపు ఉంటుందో లేదో చూడాలి.
 

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ధరలు  ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనేవారు   ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  


 హైదరాబాద్‌లో  కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,590 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,370. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.73,100.  

Latest Videos

click me!