Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి

Published : Aug 22, 2026, 11:37 AM IST

gold Price Hike: బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరల్లో కనిపిస్తున్న జోరు శనివారం కూడా కొనసాగింది.

PREV
14
చుక్కలు చూపిస్తున్న పసిడి, వెండి

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితులు, డాలర్ బలహీనపడటం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాలు గోల్డ్, సిల్వర్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090కి చేరింది. ఒక్కరోజులోనే రూ.1,520 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,500గా ఉండగా.. శనివారం రూ.1,400 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

24
బంగారం బాటలో వెండి

బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే దాదాపు రూ.10 వేల పెరుగుదల నమోదైంది. గత రెండు రోజుల్లో వెండి ధర సుమారు రూ.15 వేల వరకు పెరగడం మార్కెట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

34
అంతర్జాతీయంగా గోల్డ్‌కు డిమాండ్

అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం విలువైన లోహాలకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారింది. అమెరికా కరెన్సీపై ఒత్తిడి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా అంతర్జాతీయంగా గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుంది.

44
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆంక్షలు, ప్రతిస్పందనలు, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న ఆస్తుల కంటే సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి చూపడం సాధారణం. దీంతో బంగారం, వెండి ధరలకు మరింత సపోర్ట్ దొరికింది. 
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలపై ధరల దిశ ఆధారపడి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories