Gold Price Hike: వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
మధ్యప్రాచ్యంలో ఎలాంటి చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మార్కెట్లు వెంటనే స్పందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తుంటారు. దీనివల్ల గోల్డ్‌కు డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతాయి.
23
రూ.1,44,600కు చేరిన బంగారం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.1,44,600కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,32,550 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,08,450కు చేరుకుంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రపంచ మార్కెట్లు దృష్టి పెట్టాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు డాలర్ కదలికలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ బలహీనపడినప్పుడు సాధారణంగా బంగారం ధరలు బలపడే అవకాశం ఉంటుంది.
33
నిల్వలు పెంచుకుంటున్న ప్రపంచ బ్యాంకులు
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలను పెంచుతున్నాయి. చైనా, భారతదేశం సహా పలు దేశాలు గోల్డ్ రిజర్వులను పెంచుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారానికి మంచి డిమాండ్ కొనసాగుతోంది. దేశీయంగా చూస్తే త్వరలో పండుగల సీజన్, ఆ తర్వాత వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో జ్యువెలరీ కొనుగోళ్లు పెరిగే అవకాశముంది. ఈ డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.
అయితే బంగారం ధరలు పూర్తిగా ఒకే కారణంపై ఆధారపడవు. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధరలు, అమెరికా డాలర్ ఇండెక్స్, ముడి చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి సుంకాలు, రూపాయి-డాలర్ మారకం విలువ వంటి అనేక అంశాలు కలిసి బంగారం ధరలను నిర్ణయిస్తాయి.