Gold Rate: బంగారం ధర ఒక తులం త్వరలోనే రూ. 1 లక్ష దాటడం ఖాయం...కారణాలు తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు..

First Published | May 28, 2023, 10:17 PM IST

బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది.  ముఖ్యంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 63 వేల రూపాయలు సమీపంలో ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దిగి వస్తాయా లేక మరింత ముందుకు వెళ్తాయా అనే సందేహం సామాన్యులను వేధిస్తోంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఇంకా పూర్తవలేదు.  ఆషాడానికి కూడా ఇంకా నెల రోజుల సమయం ఉంది. అప్పటి వరకూ పెళ్లిల్లు ఉన్నాయి. కానీ పెళ్లిల్లకు అత్యంత అవసరం అయిన బంగారు నగల కొనుగోలుకు ఈ సీజన్ అస్సలు కలిసి రావడం లేదు.  ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి దీంతో అసలు బంగారం ధర ఏ స్థాయికి వెళుతుందా అనేదానిమీద చాలా చర్చ నడుస్తోంది.  నానాటికి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు  

ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి అక్కడి ప్రభుత్వం దిగజారింది దీంతో అమెరికన్ ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు విలువ లేకుండా పోయింది.  ముఖ్యంగా అధికారంలో ఉన్న  డెమోక్రాట్లు రుణ పరిమితి పెంచాలని అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు దీనికి  రిపబ్లికన్ల నుంచి మద్దతు లభించడం లేదు.  అమెరికన్ కాంగ్రెస్ సభలో రిపబ్లికన్లదే పై చేయి.  ఈ సభలో స్పీకర్ గా రిపబ్లికన్ సభ్యుడు ఉన్నారు. అయితే ప్రస్తుతం రుణ పరిమితి పెంచకపోతే జూన్ 1 నుంచి అమెరికాలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది.


 ముఖ్యంగా  అమెరికా ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు కూడా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉంది.  ఈ నేపథ్యంలో అమెరికన్ బాండ్ మార్కెట్ నుంచి పెట్టుబడిదారులు బయటకు వెళ్లే అవకాశం ఉంది.  ఇదే కనుక జరిగితే పెట్టుబడిదారులంతా సురక్షితమైన  పెట్టుబడిగా భావించే బంగారం వైపే తరలి అవకాశం ఉంది. 
 

అమెరికన్ మార్కెట్ లోని పెట్టుబడిదారులంతా పెద్ద ఎత్తున బంగారం బాండ్లను కొనుగోలు చేస్తారు.  అప్పుడు స్పాట్ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ఒక ఔన్స్ (31 గ్రాములు) ధర  2000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర త్వరలోనే 2500 డాలర్ల వరకూ వెళ్లే అవకాశం అప్పుడు, మన దేశంలో స్పాట్ మార్కెట్లో బంగారం ధర అతి త్వరలోనే 75000 దాటే అవకాశం ఉంది.  ఇదే ట్రెండు కొనసాగితే ఈ సంవత్సరం చివరి నాటికి పసిడి ధర ఒక లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు 

ఇదిలా ఉంటే బంగారం ధర ఒక లక్ష రూపాయలకు చేరితే మాత్రం ఆభరణాల మార్కెట్లో కొనుగోలు దారులకు చుక్కలు కనిపించడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అయితే మధ్యలో కొంత రిలీఫ్ కనిపించినప్పటికీ బంగారం ఒక లక్ష రూపాయలు చేరుకోవడం మాత్రం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

Latest Videos

click me!