blouse design
ఇప్పుడు ఇక ఏం వ్యాపారం చేయాలో మనం పరిశోధన చేద్దాం తద్వారా మహిళలు సులభంగా చేయగలిగే ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ మధ్యకాలంలో మగ్గం వర్క్ చేయించుకోవడం వారి సంఖ్య చాలా పెరుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు మొదలైన శుభకార్యాలకు చీరలపైన జాకెట్ల పైన మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు. మగ్గం వర్క్ అంటే ఉత్తర భారత దేశంలో దీనిని జర్దోసి వర్క్ అనే పిలుస్తారు.
blouse design
జర్దోసి వర్క్ చేయించుకున్న బ్లౌజులు అదే విధంగా ఇతర డ్రెస్సులు విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. జర్దోసి వర్క్ చేయించుకోవడానికి పనితనం ఉన్న కార్మికులు చాలా పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఈ జర్దోసి పని లేదా మగ్గం వర్క్ మీరే స్వయంగా నేర్చుకుంటే, రోజుకు వేలల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
blouse design
అయితే ఈ జర్దోసి డిజైనింగ్ వర్క్ ఎక్కడ నేర్పిస్తారు అనే సందేహం మీకు కలిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థలో ఈ జర్దోసి వర్క్ కు సంబంధించిన కోర్సు అందుబాటులో ఉంది. చదువుతో సంబంధం లేకుండానే కేవలం 1500 రూపాయలకే ఈ జర్దోసి వర్క్ ను నేర్పిస్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం Phone Number: 040-24143728, ADDRESS: Rajani Gandha Complex, Chaitanyapuri x Road, Opp.Bus Stop, Chaitanyapuri, Hyderabad-500060 సంప్రదించగలరు.
blouse design
ఈ వర్క్ నేర్చుకోవడం ద్వారా మీకు ప్రాథమిక స్థాయిలో జర్దోసి డిజైనింగ్ ఎలా చేస్తారో నేర్చుకునే వీలుంది. అనంతరం మీరు స్వయంగా ప్రాక్టీసు చేయడం ద్వారా మంచి డిజైనర్ అయ్యే అవకాశం ఉంది. ఈ మగ్గం వర్క్స్ లేదా జర్దోసి పనిని నేర్చుకున్న అనంతరం ఓ షాపును అద్దెకు తీసుకొని మగ్గం వర్క్ చేయబడును అని బోర్డు పెట్టి ఎంచక్కా డబ్బు సంపాదించుకునే వీలుంది.
పెళ్లిళ్ల సీజన్లో మగ్గం వర్క్ చేయించుకునేందుకు మహిళలు తమ బ్లౌజులతో క్యూ కడతా అంటారు. కొన్ని సెంటీమీటర్లు చొప్పున చేసే ఈ పనికి కనీసం రెండు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ లెక్కన ఒక బ్లౌజ్ మీద సగటున 5000 వసూలు చేసిన నెలకు ఒక 20 బ్లౌజులు జర్దోసి వర్క్ చేయించిన మీకు లక్ష రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంది. ఆర్డర్లు పెరిగే కొద్దీ పనివాళ్లను కూడా పెట్టుకుని మీరు ఈ డిజైనింగ్ వర్క్ చేయించవచ్చు తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
మహిళలు తమ ఇంటి వద్ద ఉంటూనే ఈ వర్క్ ను చక్కగా చేసుకునే వీలుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కెరీర్ ను ప్రారంభించవచ్చు.