బంగారం, వెండి కొంటున్నారా... ఇవాళ్టి ధరలు ఇలా.. నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు తగ్గాయా పెరిగాయా తెలుసుకోండి..

First Published | Sep 13, 2023, 10:27 AM IST

ఇండియాలో సెప్టెంబర్ 13న  నేడు బంగారం ధరలు  స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,860 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.53,920గా నమోదైంది.

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు  ఈ రోజు క్రింది విధంగా ఉన్నాయి:

ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,990 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,990. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,830 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,840.   రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ.74,500.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,830 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,840గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
 


విజయవాడలో ఈరోజు ధరల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,840,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,830. వెండి విషయానికొస్తే  వెండి ధర రూ. కిలోకు 78,000.  

 విశాఖపట్నంలో బంగారం ధరలు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 54,840 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,830. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.78,000.

ఇక మహా నగరం హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,840గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,830. వెండి విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ. కిలోకు 78,000.
 

భారతదేశంలో బంగారం ధరలు సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు ఇంకా  స్థానిక డిమాండ్ అండ్  సప్లయ్  డైనమిక్స్‌తో సహా వివిధ కారణాల ద్వారా ప్రభావితమవుతాయి.
 

Latest Videos

click me!