అలాగే బంగారు నగల దుకాణాలపై మనం గుడ్డిగా నమ్మకంతో ప్రతి నెల డబ్బులు చెల్లించలేము. పైగా ఇలా వారు డబ్బు నగదు సేకరించడానికి చట్టరీత్యా అనుమతి లేదు కనుక మీ డబ్బు రిస్క్ లో ఉన్నట్లే. కేవలం కస్టమర్, షాపు యజమాని నమ్మకం మీదనే ఈ మొత్తం తంతులు నడుస్తూ ఉంటుంది. అందుకే మీరు బంగారు నగల షాపింగ్ కు వెళ్ళినప్పుడు ఈ చిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీరు పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది.