Gold rate: వామ్మో.. బంగారం వెండి ధరలు అమాంతం పెరిగేశాయి, ఇలాగైతే పెళ్లిళ్లు జరగడం కష్టమే

Published : Sep 29, 2025, 02:20 PM IST

బంగారం, వెండి (Gold rate) ధరలు రికార్డుల మోత మోగుతున్నాయి. పండుగ సీజన్లో ఒక్కసారిగా బంగారు, వెండి ధరలు పెరిగిపోయాయి. ఎంత పెరిగాయో తెలిస్తే షాకైపోతారు. భవిష్యత్తులో ఇవి మరింతంగా పెరిగిపోవచ్చు. 

PREV
15
రికార్డు బద్దలు కొడుతున్న బంగారం

బులియన్ మార్కెట్ ప్రతిరోజు రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వెండి, బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. వారానికో, నెలకో ఒకసారి కాదు... ప్రతిరోజు వీటి ధరలలో ర్పు రావడం ప్రజలను ఇబ్బంది పెడుతోంది.ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైతే బంగారం కొనుగోళ్లు ఎక్కువవుతాయి. పేద, మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది.

25
బంగారం ధర ఇలా

ఇప్పుడున్న ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం జిఎస్టి తో కలిపి 10 గ్రాములకు 1,18,750 రూపాయలకి చేరుకుంది. ఇక వెండి కిలో ధర జిఎస్టితో కలిపి 1,48,463 రూపాయలకు చేరుకుంది. కేవలం ఒక్క సెప్టెంబర్లోనే 10 గ్రాముల బంగారం ధర 12,000 రూపాయలు పెరిగింది. ఇక వెండి కిలో గ్రాము ధర 26,528 రూపాయలు ఒక్కో నెలలోనే పెరిగిపోయింది. ప్రతినెలా ఇలా పెరుగుతూ వస్తూ ఉంటే ఆభరణాల రూపంలో బంగారాన్ని కొనడం చాలా కష్టంగా మారిపోతుంది.

35
పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర

18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 86,469 రూపాయలకి చేరుకుంది. అదే జీఎస్టీతో కలిపితే దాని ధర మరొక 3000 రూపాయలు అధికంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,05,067 రూపాయలకి చేరుకుంది. జిఎస్టి తో కలిపితే 1,80,000 రూపాయలు దాటిపోయింది.

45
బంగారం ధర పెరుగుతుంది?

బంగారం ధర ఎందుకు పెరుగుతుందో అని పేద, మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. బంగారం, వెండి ధరలు ఆపడం ఎవరి చేతుల్లోనూ లేదు. డాలర్ బలహీనపడడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పండుగ సీజన్లు, ఫెడ్ రేటు తగ్గింపు, అమెరికాలో ఉద్యోగాల డేటా... వీటన్నిటిపై కూడా బంగారం ధర పెరుగుదల ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ధరలు నియంత్రించడం కేవలం మన ప్రభుత్వం వల్ల కుదరదు.

55
బంగారం ధర కంట్రోల్ చేయలేమా?

మనదేశంలో,ఇతర దేశాల్లో ఎప్పుడైతే ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతుందో ఆ ప్రభావం నేరుగా బంగారం పైనే పడుతుంది. మన దేశంలో బంగారం అనేది ఒక ముఖ్యమైన పెట్టుబడిగా మారిపోయింది. అందులోనూ సాంస్కృతిక చిహ్నంగా కూడా భావిస్తారు. కచ్చితంగా బంగారు ఆభరణాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ప్రతి ఏడాది ధన్‌తేరాస్, శ్రావణమాసంలో బంగారాన్ని కొనే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. అందుకే బంగారం ధర నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. ముఖ్యంగా మన దేశంలో బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందుకే డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. ప్రస్తుతం బంగారాన్ని ఆభరణాల రూపంలో, నాణాల రూపంలో, డిజిటల్ బంగారు రూపంలో వినియోగిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories