బంగారం ధరల విషయానికొచ్చినట్లయితే, దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58671 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు ప్రస్తుతం ఒక ఔన్సు 31 గ్రాముల ధర 1911 డాలర్లు పలుకుతోంది. మే నెలలో బంగారం ధర 2050 డాలర్ల రూపాయలు పలికింది. అక్కడి నుంచి గడిచిన మూడు నెలల్లో బంగారం ధర ఏకంగా 1880 డాలర్లకు పడిపోయింది.