Business Ideas: ఉద్యోగం చేసి విసిగిపోయారా..అయితే ఇలా బిజినెస్ చేస్తే మొదటి రోజు నుంచే విపరీతమైన లాభాలు ఖాయం..

First Published | Aug 23, 2023, 7:00 PM IST

Business Ideas: ఈ మధ్యకాలంలో చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని గడపడం చాలా కష్టంగా మారిపోతుంది దీంతో చాలామంది వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే వ్యాపారం చేయడం ద్వారా మీరు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది.  మీరు కనుక వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే, ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫుడ్ బిజినెస్ లో ముఖ్యంగా ఫ్రాంచేసి పద్ధతిలో వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అలాంటి చక్కటి ఫ్రాంచైజీ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  ఫ్రాంచేసి రూపంలో బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రత్యేకంగా బ్రాండ్ ను నిర్మించాల్సిన పని ఉండదు. అలాగే మీరు పబ్లిసిటీ కోసం కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన పని ఉండదు. . పేరు ఎన్నిక గన్న బ్రాండ్ ఫ్రాంచేసి తీసుకోవడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

 మార్కెట్లో ప్రస్తుతం బేకరీ ఉత్పత్తులకు చక్కటి డిమాండ్ ఉంటోంది.  చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బర్త్డే కేకులు, ఇతర బిస్కెట్లు,  వంటి  ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కు  మంచి డిమాండ్ ఉంటుంది.  మీరు కనుక బేకరీ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే, మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లు అయినటువంటి బేకరీ ఉత్పత్తి సంస్థ నుంచి ఫ్రాంచేసి పొందడం ద్వారా మీ బిజినెస్ సక్సెస్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. 
 


 ప్రస్తుతం మార్కెట్లో  కరాచీ బేకరీ,  పిస్తా హౌస్,  మొంగనీస్,  స్విస్ కాజిల్  వంటి బేకరీ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది.  ఆయా సంస్థలు ఫ్రాంచేసి పద్ధతుల్లో మీ ప్రదేశంలో వారి బ్రాండ్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.  మీరు కనుక కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి బేకరీలకు మంచి డిమాండ్ ఉంటుంది. 
 

 ఫ్రాంచైజీ పద్ధతిలో బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రత్యేకంగా కస్టమర్లను వెతుక్కోవాల్సిన పని ఉండదు. . అంతేకాదు మీకు బ్రాండ్ నేమ్ ద్వారా పబ్లిసిటీ అయిపోతుంది. తద్వారా మీరు మొదటి రోజు నుంచే మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.  మీరు ఒకవేళ ఫ్రాంచేసి పద్ధతిలో బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే, సదరు సంస్థను సంప్రదిస్తే మంచిది. తద్వారా మీరు పూర్తి వివరాలు అందుకోవచ్చు. 

అలాగే మీ వ్యాపారానికి మూలధనం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలను ఉపయోగించుకోవచ్చు.  ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్రా రుణం ద్వారా గరిష్టంగా 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది కావున మీరు బేకరీ వ్యాపారంలో ఫ్రాంచేసి పద్ధతిలో ప్రారంభించినట్లయితే మొదటి రోజు నుంచే మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. 
 

Latest Videos

click me!