ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ చెల్లించిన అద్దె వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీని ప్రకారం అద్దె మొత్తం లక్షల్లో ఉండగా...
ఈ ఆఫీస్ బాంద్రా కుర్లా క్యాంపస్‌లోని మేకర్ మాక్సిటీ మొదటి అంతస్తులో ఉంది. ఈ ప్రాంతంలో NSE ఆండ్ SEBI ఆఫీసులు కూడా ఉన్నాయి. ఆర్థిక రాజధానిలో సందడిగా ఉండే ఈ ప్రాంతంలో అనేక ప్రముఖ బ్యాంకులు కూడా ఉన్నాయి.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొత్త వెంచర్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దాని మాతృ సంస్థలో సుమారు రూ. 1 లక్ష కోట్ల విలువైన 6.1 శాతం వాటా ఉంది.
మొదటి మూడు సంవత్సరాలకి Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీస్ రెంట్ నెలకు 55.50 లక్షలు. మిగిలిన రెండేళ్లకి ప్రతినెలా అద్దె రూ.63.81 లక్షలు.
గతంలో రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని పిలిచే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ముంబైలో 13,872 చదరపు అడుగుల స్థలాన్ని ప్రతినెలా అద్దె రూ.55.50 లక్షలతో లీజుకు తీసుకుంది .
Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీస్ కోసం 83.23 లక్షలు డిపాజిట్ అలాగే ఏడు కార్ పార్కింగ్ కోసం స్థలాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ కంపెనీ విస్తరణ మోడ్‌లో ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఆఫీస్ స్పేస్ తీసుకోనున్నట్లు తెలిపారు.
FY23 అన్యువల్ రిపోర్ట్ లో కంపెనీ భారతీయులకు 'సరసమైన, డిజిటల్-ఫస్ట్' ఆర్థిక పరిష్కారాలను అందిస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు.