బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ వద్ద సరిపడా డబ్బు లేదా, అలా అని మీరు బంగారం కొనుగోలు చేయడం మానేయకండి. కొద్ది మొత్తంలో బంగారు కొనుగోలు చేయడం ద్వారా కూడా మీరు లాభం పొందే వీలుంది. త్వరలోనే బంగారం ధర 1 లక్ష రూపాయల వరకు చేరే వీలుంది. ఈ నేపథ్యంలో మీరు బంగారంపై పెట్టుబడులు పెట్టడం ఆకర్షణీయంగా మారుతుంది.
బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే కేవలం బంగారు నగలు కొంటే సరిపోదు ఎందుకంటే నగల రూపంలో బంగారం కొంటే అందులో మేకింగ్ చార్జీలు, వీఏ రూపంలో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు మీరు కొనుగోలు చేసే బంగారం 22 క్యారెట్ల అది ఉంటుంది అంటే దాని విలువ అప్పటికే కొద్దిగా తగ్గి ఉంటుంది అందుకే మీరు బంగారు నగలు కొన్నట్లయితే అవి పెట్టుబడికి అంత పనికిరావనే చెప్పాలి. కానీ బంగారు రుణాలు తీసుకోవడానికి మాత్రం చాలా ఉపయోగపడతాయి. ఇలా కాకుండా మీరు పెరుగుతున్న బంగారం ధరపై లాభాలు పొందాలంటే మాత్రం బంగారు బాండ్లను కొంటేనే మంచిది.
గోల్డ్ ఈటీఎఫ్ లపై పెట్టుబడి
గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు పెరుగుతున్న బంగారం ధరపై చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది వీటిని మీరు డిమార్ట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది కనీస చార్జీలు చెల్లించి డిమార్ట్ అకౌంట్ లో మీరు ఈ గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్లో బంగారం ధర హెచ్చుతగ్గుల పైన ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ తగ్గడం పెరగడం జరుగుతుంటాయి వీటి నుంచి లాభాలు పొందడం కూడా చాలా సులభం.
డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి
మీరు డిజిటల్ రూపంలో కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఇందుకోసం పేటీఎం గూగుల్ పే అమెజాన్ పే లాంటి సంస్థలు ఆఫర్ చేస్తున్న డిజిటల్ వాలెట్స్ లో మీరు బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవచ్చు. వీలైతే మీరు డెలివరీ కూడా పొందే అవకాశం ఉంది అయితే డెలివరీ కోసం మేకింగ్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది కానీ దీని వల్ల లాభం ఏంటంటే మీరు కనీసం ఒక రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేసే వీలుంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్స్
భారత ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సురక్షితంగా బంగారంపై లాభం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవి బాండ్స్ రూపంలో ఉండే హామీ పత్రాలు. మార్కెట్లో బంగారం ధర పెరిగితే మీ బాండ్ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అదనంగా మీకు ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. ఈ సావరిన్ బాండ్స్ లో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సైతం పెట్టుబడి పెట్టవచ్చు.