ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్స్ అయిన మలబార్ గోల్డ్, జాయ్ అలుకాస్, బీమాస్ గోల్డ్ లాంటి నగల నగల దుకాణాలు కేరళ కేంద్రంగానే దేశ వ్యాప్తంగా బ్రాంచీలను వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. కేరళ రాష్ట్రానికి బంగారంతో అవినావభావ సంబంధం ఉంది. ప్రాచీన కాలం నుంచి కూడా కేరళ రాష్ట్రం విదేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికా ఖండంతో కూడా వాణిజ్య సంబంధాలను కేరళ రాష్ట్రం కలిగి ఉంది. పోర్చుగీసు పాలకులు సైతం బంగారం వర్తకాన్ని ప్రోత్సహించారు.